Home » Bangladesh Protests
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనలు చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయక తప్పలేదు. రాజీనామా అనంతరం హసీనా బంగ్లాదేశ్ నుంచి పరారై భారత్‌కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి లండన్ వెళ్లబోతున్నారు.
రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతున్న వేళ ఆ దేశంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆర్మీ హెలీకాఫ్టర్‌లో భారత్‌లో అడుగుపెట్టారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ (Bangladesh Clashes)లో తీవ్ర అల్లర్లకు కారణమైంది. ఇప్పటికే ఆ దేశంలో వందల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందారు. ఆదివారం ఒక్క రోజే పోలీసులు జరిపిన కాల్పుల్లో 100 మంది నిరసనకారులు చనిపోయారు.
పొరుగునున్న బంగ్లాదేశ్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను భారత్ నిశీతంగా గమనిస్తుంది. బంగ్లాదేశ్‌లో ఆదివారం ఒక్కసారిగా చోటు చేసుకున్న హింసపై భారత్ తనదైనశైలిలో స్పందించింది. అందులోభాగంగా ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) కీలక సూచనలు జారీ చేసింది.
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తో విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం తొలి రోజు, ఆదివారం దేశ వ్యాప్తంగా రక్తపాతానికి దారి తీసింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింస ఆదివారం మరో మలుపు తిరిగింది. పోలీసుల దాడుల్లో ఒక్క రోజులో 72 మంది నిరసనకారులు చనిపోయారు.