Home » BCCI
T10 League: బీసీసీఐ మరో మెగా లీగ్‌ను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్ ప్రారంభించే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 నుంచే ఈ టీ10 లీగ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Jersey Number 7: క్రికెట్ ప్రపంచంలో సచిన్‌కు ఎంత పేరు వచ్చిందో ధోనీకి అంతే పేరు వచ్చింది. సచిన్ టన్నుల కొద్దీ పరుగులు చేసి భారత్ ప్రతిష్టను పెంచగా.. ధోనీ రెండు ప్రపంచకప్‌లను అందించి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. దీంతో సచిన్ జెర్సీ నంబర్ 10కి రిటైర్మెంట్ ఇచ్చినట్లుగానే.. ధోనీ జెర్సీ నంబర్ 7కు రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు గతంలో బీసీసీఐకి సూచించారు.
BCCI Net Worth: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఆదాయపరంగా మిగతా క్రికెట్ బోర్డులు ఏవి బీసీసీఐకి చేరువలో కూడా లేవు. ప్రస్తుతం బీసీసీఐ దగ్గర ఉన్న డబ్బుతో అవరమైతే ఐసీసీనే కొనేయగలదు.
Jay Shah: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాతి నుంచి పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. అప్పటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్‌కు ఆటగాడిగా కూడా దూరంగా ఉంటున్నాడు.
రెండేళ్ల క్రితం విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో జరిగిన డ్రామా గురించి ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో కోహ్లీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
Team India: టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. అయితే ఈ పొడిగింపు ఎప్పటి వరకు అన్న విషయం బీసీసీఐ ప్రస్తావించలేదు. కోచ్‌గా కొనసాగేందుకు ద్రవిడ్ అంగీకారం తెలపడంతో అతడితో పాటు సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది.
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ మరికొంత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ప్రారంభం కాబోయే దక్షిణాఫ్రికా పర్యటనలో హెడ్ కోచ్‌గా ఉండాలని ఇప్పటికే రాహుల్ ద్రావిడ్‌ను బీసీసీఐ కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే ద్రావిడ్ కాంట్రాక్ట్‌ను మరో రెండేళ్లు పెంచే అవకాశాలున్నాయని పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ పేర్కొంటున్నాయి.
India Vs Australia T20 Series: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించగా.. ఈ జట్టులో సంజు శాంసన్ పేరు లేకపోవడంతో కొందరు అభిమానులు బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజుపై ఎందుకింత కక్ష అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదు సరే.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని బీసీసీఐ పెద్దలను నిలదీస్తున్నారు.
ప్రపంచ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో 6వసారి ఎగరేసుకుపోవాలని ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి పోరాటం మొదలుకానుంది.
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. ఈ మేరకు క్రికెట్ అభిమానులకు బీసీసీఐ చివరి అవకాశాన్ని కల్పిస్తోంది. సెమీస్, ఫైనల్ లాంటి నాకౌట్ మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను ఈనెల 9న అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఆయా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియాలలో చూసి టీమిండియాకు మద్దతు తెలపాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.