Home » Beauty
‘‘ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్’’ అంటారు. కానీ పైబడే వయసు చర్మం చెప్పేస్తూ ఉంటుంది. పైబడే వయసుతో చర్మం బిగుతు సడలి, జారిపోయి, ముడతలు పడి అందవిహీనంగా మారిపోతుంది.
బెండకాయ పోషకాల నిధి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు బెండకాయలో ఉంటాయి, ఇవి మొత్తం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతే కాదు, ఈ పోషకాలు జుట్టు దృఢత్వానికి కూడా చాలా మేలు చేస్తాయి.
పెదవులు నల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. నల్లగా ఉన్న పెదవులను తిరిగి గులాబీ రంగులో మృదువుగా మార్చడం అసాధ్యం అని చాలామంది అంటూ ఉంటారు. కానీ కొన్ని టిప్స్ ఉపయోగించి పెదవులను గులాబీ రెక్కల్లా మృదువుగా, అందంగా మార్చవచ్చు
నెయ్యి ఎన్నో ఏళ్ల నుండి ఆహారంలో భాగంగా ఉంది. ఆయుర్వేదం నెయ్యిని ఔషదంగా పరిగణిస్తుంది. ఎన్నో వంటలలోనూ, తీపి పదార్థాల తయారీలోనూ నెయ్యి తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అయితే నెయ్యిని కేవలం వంటలలో మాత్రమే కాదు.. చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తున్నారు. దీని గురించి చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బ్యూటీ సెలూన్ లో కెరాటిన్ ట్రీట్మెంట్ కు బోలెడు డబ్బు ఖర్చవుతుంది. పైగా వీటిలో రసాయనాలు వాడతారు. అలా కాకుండా ఇంట్లోనే మిగిలిపోయిన అన్నంతో కెరాటిన్ ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు.
హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శృతి చక్రవర్తి రాజస్థాన్, జైపూర్‌లో జరిగిన మిసెస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి అందరినీ అలరించారు. భరత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో ప్రతిభావంతులైన మరో 20 మంది కంటెస్టెంట్స్‌తో పోటీపడిన శృతి చక్రవర్తి.. ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.
సోషల్ మీడియాలో జుట్టు పెరుగుదలకు సంబంధించి బోలెడు చిట్కాలు వైరల్ అవుతుంటాయి. వాటిలో రైస్ వాటర్ నుండి కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లితో పాటు చాలా ఉన్నాయి. కానీ ఉల్లిపాయ, వెల్లుల్లి.. రెండింటిలో ఏది బెస్టంటే..
ఎండల వల్ల శరీర చర్మం మీద టాన్ వస్తే దాన్ని ఇంటిపట్టునే ఈజీగా వదిలించుకోవచ్చు. దీనికోసం ముల్తానీ మట్టిలో కేవలం ఒకే ఒక పదార్థం కలిపి ఉపయోగిస్తే సరిపోతుంది.
ఎక్కువసేపు నీటిలో, ఎండలో ఉండటం, తగినంత పోషకాహారం లేకపోవడం వల్ల కాలి మడమల పగుళ్లు ఏర్పడతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇవి మరింత పెరిగి ఒక్కోసారి కాలి మడమల నుండి రక్తస్రావానికి కారణమవుతాయి.
విటమిన్-ఇ క్యాప్సూల్ ను చాలామంది చర్మ సంరక్షణలో ఉపయోగిస్తారు. కానీ దీన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో చాలా తక్కువమందికి తెలుసు.