Home » Bellampalli
కుమరంభీం ఆసి ఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన మహి ళపై అత్యాచారయత్నం, దాడికి పాల్పడిన నిందితుడి పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 21న రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చినట్లు ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మహాలక్ష్మి పథకం ఎల్పీజీ సబ్సిడీ పత్రాల పంపిణీలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అ ర్హులైన వారికి రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామన్నారు.
దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో పాముకాటుతో సెక్యూరిటీ గార్డు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని ఆరుగురు సెక్యూరిటీ గార్డులు బ్యారక్‌కు చేరుకొని నిద్రలోకి జారు కున్నారు.
విద్యార్థులకు పురుగుల అన్నం... నీళ్ల పప్పు వడ్డించడంపై బెల్లంపల్లి జూని యర్ సివిల్ జడ్జి ముఖేష్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీ బీవీ పాఠశాలతోపాటు ఆదర్శ మోడల్ కళాశాల హాస్ట ల్ను పరిశీలించారు. మోడల్ కళాశాలలో పురుగుల అన్నంతోపాటు నీళ్ల పప్పు వడ్డించడాన్ని చూసి ఆగ్ర హం వ్యక్తం చేశారు.
మండల కేంద్రంలోని కస్తూర్బా ఆశ్రమ పాఠ శాలను బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముకేష్ గురువారం రాత్రి తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు, సిలబస్ అంశాలను తెలుసుకున్నారు. సమస్యలను తెలిపితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జడ్జి పేర్కొన్నారు.
డంపింగ్‌యార్డు సమస్యను త్వర లోనే పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత అన్నారు. మం గళవారం ఆర్డీవో హరికృష్ణతో కలిసి పెద్దనపల్లిలోని డంపింగ్‌యార్డు కోసం స్థలాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ కొన్ని నెలలుగా పట్టణంలో డంపింగ్ యార్డు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార న్నారు.
గణేష్ నిమజ్జనానికి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని మున్సిపల్ చైర్ప ర్సన్ జక్కుల శ్వేత పేర్కొన్నారు. మంగళవారం నిమజ్జనం కోసం బెల్లంపల్లి పోచమ్మ చెరువు వద్ద ఏర్పాట్లను ఆర్డీవో హరికృష్ణ, ఏసీపీ రవికుమార్‌లతో కలిసి పరిశీలించారు. వారు మాట్లాడుతూ చెరువు లో నిమజ్జనం కోసం పూడికతీత చేపట్టామన్నారు.
బెల్లంపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి కోసం గోదావరి నీటిని అందిస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. సోమవారం ఎల్లంపల్లి, బెల్లంపల్లిలోని తాగునీరు సరఫరా చేసే పంప్ హౌజ్‌లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్ పథకంలో భాగంగా రూ.61 కోట్ల నిధులతో ఎల్లంపల్లి నుంచి బెల్లం పల్లికి గోదావరి నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొ న్నారు.
ప్రాణహిత నది బ్యాక్ వాటర్‌తో మండలం లో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ హామీ ఇచ్చారు. ఆదివారం సుంపుటం, వేమనపల్లి, ముల్కలపేట, రాచర్ల గ్రామాల్లో ప్రాణహిత నది బ్యాక్ వాటర్‌తో నష్టపోయిన పత్తి పంటలను పరిశీలిం చారు.
వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటు లో ఉంటూ అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ సూచించారు. మంగళవారం తాళ్లగురిజాల పీహెచ్‌సీని సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, రికార్డులు, రిజిష్టర్లను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వైద్యు లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.