అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠినచర్యలు
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:21 PM
అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల నుంచి ఆన్‌లైన్ ద్వారా అధికారికంగా ఇసుక రవాణా చేయాలన్నారు. మండ లంలోని కర్జీ ఇసుక రీచ్‌ను గురువారం కలెక్టర్ సంద ర్శించారు.
నెన్నెల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల నుంచి ఆన్‌లైన్ ద్వారా అధికారికంగా ఇసుక రవాణా చేయాలన్నారు. మండ లంలోని కర్జీ ఇసుక రీచ్‌ను గురువారం కలెక్టర్ సంద ర్శించారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పత్రాలు, ఆన్ లైన్‌లో బుక్ చేసిన వివరాలను పరిశీలించారు. క్వారీ లో ఎంత లోతు వరకు ఇసుక తవ్వుతున్నారు.. రోజుకు ఎంత ఇసుక, ఎక్కడెక్కడికి తరలిస్తున్నారో అధికారు లను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
గొళ్లపల్లి, నెన్నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. సన్నం, దొడ్డు రకాల ధాన్యాన్ని వేర్వేరుగా కొనుగోలు చేయాలని సూ చించారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500ల బోనస్ అందజేస్తోంద న్నారు. సన్నరకం ధా న్యాన్ని గుర్తించి ఏఈ వోలు ధ్రువీకరణ పత్రా లు జారీ చేయా లన్నా రు. కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలన్నారు. ధాన్యా న్ని కొనుగోలు కేంద్రా నికి తీసుకు వచ్చేట ప్పుడు 17 శాతానికి తక్కువ తేమ ఉండే విధంగా ఆరబెట్టి తేవాలని సూచించారు. అనంతరం గొళ్లపల్లిలో మండల పరిషత్తు పాఠశాలను తనిఖీ చేశారు. వంటశాల, పరిసరాలను, రిజిష్టర్లు పరిశీలిం చారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఇవ్వాలని, శుద్ధ మైన తాగునీరు పిల్లలకు అందుబాటులో ఉంచాల న్నారు. తహసీల్దార్ సబ్బ రమేష్ ఉన్నారు.
మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ
మంచిర్యాల కలెక్టరేట్ (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతా ల్లో మూడు రోజుల్లో నగదు జమ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నగ దు జమ అయిన రైతులు కలెక్టర్‌ను మర్యాద పూర్వ కంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. సన్నరంకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుంద న్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా పౌరసరఫరా అధికారి బ్రహ్మ రావు, మేనేజర్ శ్రీకల, రమేష్, రైతులు పాల్గొన్నారు.