Home » Bengaluru News
తుంగభద్ర(Tungabhadra)కు వరద పోటెత్తుతోంది. జలాశయంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. డ్యాం 19వ క్రస్ట్ గేటు విరిగిపోవడంతో నీరు వృథాగా పోయి అన్నదాత ఆవేదన పడిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో డ్యాంలో మళ్లీ జలకళ ఉప్పొంగుతోంది.
రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఓ మంత్రిని తీవ్రంగా హెచ్చరించినట్టు సమాచారం.
కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర కలకలం రేగింది. పార్కింగ్ ఏరియా వద్ద సిబ్బందిపై ఒకతను విచక్షణరహితంగా దాడి చేశాడు. తనతో తీసుకొచ్చిన కొడవలితో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే చనిపోయాడు.
ఏడాది కిందట శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. రెండోసారి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్‌కు వివాదాలు చుట్టుముడుతున్నాయి.
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫే్‌స(యూపీఐ) మాదిరిగా.. సులభతర రుణాల కోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫే్‌స(యూఎల్ఐ)ని పరిచయం చేయనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
జీవిత బీమా సొమ్ము పొందేందుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు నమ్మించారు. అందుకు అవసరమైన మృతదేహం కోసం ఓ యాచకుడిని హత్య చేశారు.
బెంగళూర్ ప్రజలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వబోతుంది. త్వరలో మంచి నీటి ధరల పెంపు ఉండనుంది. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటన చేశారు. బెంగళూర్ వాటర్ సప్లై అండ్ సివెజ్ బోర్డు నష్టాల్లో ఉందని వివరించారు. ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు నీటిపై పన్ను విధించడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదన్నారు.
రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ పట్ల అవమానం చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని, ముఖ్యమంత్రి రాజీనామా చేసేదాకా ఆందోళనలు విరమించేది లేదని పరిషత్ ప్రతిపక్షనేత చలవాది నారాయణస్వామి(Chalavadi Narayanaswamy) పేర్కొన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోంది. ‘ముడా’ అవినీతి కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)ను ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇచ్చిన గవర్నర్‌పై మూకుమ్మడిగా నాయకులంతా తిరగబడ్డా ఈ మద్దతు ఎంతకాలమనేది చర్చలకు దారితీస్తోంది.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్‌కు అనుమతించిన గవర్నర్ తీరును ఆక్షేపిస్తూ తీర్మానం తీసుకున్నామని, ఎమ్మెల్యేలంతా సీఎంకు అండగా ఉంటారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) వెల్లడించారు.