Share News

Bangalore: సీఎంకు అండగా ఉంటాం.. గవర్నర్‌ తీరు ఆక్షేపణీయం

ABN , Publish Date - Aug 23 , 2024 | 11:36 AM

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్‌కు అనుమతించిన గవర్నర్‌ తీరును ఆక్షేపిస్తూ తీర్మానం తీసుకున్నామని, ఎమ్మెల్యేలంతా సీఎంకు అండగా ఉంటారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) వెల్లడించారు.

Bangalore: సీఎంకు అండగా ఉంటాం.. గవర్నర్‌ తీరు ఆక్షేపణీయం

- ప్రతిపక్షాల కుట్రలను అడ్డుకుంటాం

- మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు

- ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

బెంగళూరు: ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్‌కు అనుమతించిన గవర్నర్‌ తీరును ఆక్షేపిస్తూ తీర్మానం తీసుకున్నామని, ఎమ్మెల్యేలంతా సీఎంకు అండగా ఉంటారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) వెల్లడించారు. విధానసౌధలో సీఎల్పీ సమావేశం అనంతరం డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ... ఎటువంటి ప్రాథమిక విచారణ లేకుండా ముఖ్యమంత్రిపై సెక్షన్‌ 17ఎ కింద దర్యాప్తునకు అనుమతించిన గవర్నర్‌ నిర్ణయాన్ని ఖండిస్తూ సీనియర్‌ ఎమ్మెల్యే ఆర్‌వీ దేశ్‌పాండే ప్రతిపాదించారన్నారు. ఇందుకు తన్వీర్‌సేఠ్‌ మద్దతు ఇచ్చారని తెలిపారు. పార్టీలోని ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అండగా ఉంటామని మద్దతు తెలిపారని అన్నారు.

ఇదికూడా చదవండి: Bangalore: ఈ మంతనాల మర్మమేమిటో..? కాంగ్రెస్‏లో ఏదో జరుగుతోంది...


సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారని వివరించారు. స్పీకర్‌ ఆదేశాలతో ఆరుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో జరుగుతున్న శిక్షణ శిబిరానికి వెళ్లారని తెలిపారు. ముఖ్యమంత్రి(Chief Minister)కి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారని వారికి అభినందనలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 136 మంది ఎమ్మెల్యేలు గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అత్యధిక మెజారిటీతో ఏర్పాటైన ప్రభుత్వాన్ని అస్థిరం చేసేందుకు బీజేపీ, జేడీఎస్(BJP, JDS) కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. శుక్రవారం అధిష్టానం పెద్దలతో భేటీ ఉందని తాను, సీఎం వెళ్లి ప్రస్తుత రాజకీయాలపై చర్చించనున్నట్టు తెలిపారు. గవర్నర్‌ తీరుపై కోర్టులో న్యాయపోరాటానికి అర్జీలు సమర్పించామని పేర్కొన్నారు.


కుట్రలను అడ్డుకుంటాం...

ఒక ప్రసంగాన్ని నెపం చేసుకుని రాహుల్‌గాంధీని ఎంపీ స్థానం నుంచి అనర్హత వేటు వేసిన రీతిలో ముఖ్యమంత్రిపై కూడా కుట్ర పన్నారని, ఇలాంటి వాటిని అడ్డుకుంటామని డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) అన్నారు. తమకు ప్రజాబలం ఉందని, రాజ్యాంగపరంగా కొనసాగేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ‘ఇండియా’ కూటమి మద్దతు ఉందా అని ప్రశ్నించగా కూటమి పుట్టిందే ఇక్కడని, దేశవ్యాప్తంగా 234 సీట్లు సాధించినట్టు తెలిపారు.


ప్రస్తుతం కలసికట్టుగా పోరాటం చేయనున్నట్టు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో పార్టీ పెద్దల చర్చల అనంతరం వివరిస్తానని అన్నారు. గవర్నర్‌ నిర్ణయాన్ని మంత్రివర్గం ఖండిస్తూ తీసుకున్న తీర్మానాన్ని పంపారా అని ప్రశ్నించగా గవర్నర్‌ తమ ఘనతను కాపాడుకునేందుకు ఇప్పుడైనా ప్రాసిక్యూషన్‌కు ఇచ్చిన అనుమతులను విరమించుకోవాలని, దీనిపై తాము న్యాయపోరాటానికి సన్నద్ధమని, లేనిపక్షంలో ఆయనకు భంగపాటు తప్పదన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 23 , 2024 | 11:36 AM