Share News

Governor Shaktikanta Das : యూపీఐ తరహాలో.. యూఎల్‌ఐ

ABN , Publish Date - Aug 27 , 2024 | 04:15 AM

యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స(యూపీఐ) మాదిరిగా.. సులభతర రుణాల కోసం యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫే్‌స(యూఎల్‌ఐ)ని పరిచయం చేయనున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.

Governor Shaktikanta Das : యూపీఐ తరహాలో.. యూఎల్‌ఐ

  • రుణాల కోసం తీసుకురానున్న ఆర్బీఐ

  • ఒక్క సమ్మతితో వెంటనే మంజూరు

  • ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో.. త్వరలో దేశవ్యాప్తం

  • ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడి

  • యూపీఐ తరహాలో..రుణాల కోసం యూఎల్‌ఐ

బెంగళూరు, ఆగస్టు 26: యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స(యూపీఐ) మాదిరిగా.. సులభతర రుణాల కోసం యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫే్‌స(యూఎల్‌ఐ)ని పరిచయం చేయనున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.

meeku telusa-27 copy.jpg

2016 డిజిటల్‌ చెల్లింపుల కోసం తీసుకువచ్చిన యూపీఐ విజయవంతమవ్వడంతో.. చిరు వ్యాపారులు, ఎంఎ్‌సఎంఈలు, గ్రామీణులకు ఎలాంటి ఆటంకాల్లేకుండా రుణాలు తీసుకోవడానికి యూఎల్‌ఐని గత ఏడాది రెండు రాష్ట్రాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఈ విధానం విజయవంతమైందని, దాంతో.. దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆర్‌బీఐ ఆవిర్భవించి 90 ఏళ్లవుతున్న సందర్భంగా సోమవారం బెంగళూరులో ‘డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌’ అనే అంశంపై ఏర్పాటు చేసిన గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించారు.


‘‘ఆర్‌బీఐ పరిధిలో పనిచేసే భారత జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్‌పీసీఐ) ద్వారా యూపీఐని అందుబాటులోకి తీసుకువచ్చాం. నగదు రహిత చెల్లింపులకు ఈ విధానం ఎంతగానో ఉపకరిస్తోంది. ఒక్క క్యూఆర్‌ కోడ్‌ లేదా యూపీఐ ఐడీ లేదా మొబైల్‌ నంబర్‌తో చెల్లింపులు చేసే వెసులుబాటును కల్పించింది.

ఆర్థిక సేవల డిజిటలీకరణను విజయవంతం చేసింది. ఇదే స్ఫూర్తితో కేవలం ఒక సమ్మతి(కన్సెంట్‌)తో గ్రామీణులు, చిరు వ్యాపారులు, ఎంఎ్‌సఎంఈలు రుణాలు తీసుకునేందుకు యూఎల్‌ఐ దోహదపడుతుంది’’ అని ఆయన వివరించారు.

యూఎల్‌ఐ ప్లాట్‌ఫారంతో బహుళ డేటా సర్వీస్‌ ప్రొవైడర్లు, రుణదాతలు, వివిధ రాష్ట్రాల భూరికార్డుల డిజిటల్‌ సమాచారంతో అనుసంధానమై ఉంటాయని వివరించారు. ‘‘క్రెడిట్‌ అర్హత మదింపు కోసం పట్టే సమయాన్ని యూఎల్‌ఐ తగ్గిస్తుంది. యూపీఐ మాదిరిగానే.. అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫే్‌స(ఏపీఐ) ఆధారంగా యూఎల్‌ఐ పనిచేస్తుంది.

అంటే.. బ్యాంకింగ్‌, నాన్‌-బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థలు ఈ ఏపీఐ ఆధారంగా రుణాలను అందజేయవచ్చు. ఈ ఏపీఐ ద్వారా.. రుణాలు తీసుకునేవారి ఆర్థిక, ఆర్థికేతర డేటా ఒకే చోట లభ్యమవుతుంది. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైంది. దేశవ్యాప్తంగా యూఎల్‌ఐ అందుబాటులోకి వస్తే.. మరో డిజిటల్‌ విప్లవానికి నాంది పలికినట్లవుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 27 , 2024 | 04:15 AM