Bengaluru: బెంగళూర్ ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం
ABN , Publish Date - Aug 29 , 2024 | 08:32 AM
కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర కలకలం రేగింది. పార్కింగ్ ఏరియా వద్ద సిబ్బందిపై ఒకతను విచక్షణరహితంగా దాడి చేశాడు. తనతో తీసుకొచ్చిన కొడవలితో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే చనిపోయాడు.
బెంగళూర్: కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (Bengaluru Airport) వద్ద తీవ్ర కలకలం రేగింది. పార్కింగ్ ఏరియా వద్ద సిబ్బందిపై ఒకతను విచక్షణరహితంగా దాడి చేశాడు. తనతో తీసుకొచ్చిన కొడవలితో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే చనిపోయాడు. రద్దీగా ఉంటే ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన భద్రతా వైఫల్యాన్ని చాటింది.
ఏం జరిగిందంటే..?
ఎయిర్ పోర్టులో రామకృష్ణ అనే వ్యక్తి ట్రాలీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. రమేష్ అనే వ్యక్తి భార్యతో రామకృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరి గురించి రమేష్‌కు తెలిసింది. ఆ తర్వాత రామకృష్ణ ఊరి నుంచి బెంగళూర్ వచ్చేశాడు. రామకృష్ణ ఎక్కడ ఉన్నాడు.. ఏం పనిచేస్తున్నాడనే విషయం రమేష్ తెలుసుకున్నాడు. బెంగళూర్ ఎయిర్ పోర్టులో పనిచేస్తున్నాడని తెలుసుకొని వచ్చాడు. కాలేజీ బ్యాగులో కొడవలి తీసుకొని వచ్చాడు. బీఎంటీసీ (సిటీ బస్సు)లో ఎయిర్ పోర్టులోకి ప్రవేశించాడు. బస్సులో రావడంతో అతని బ్యాగ్‌ను సిబ్బంది తనిఖీ చేయలేదు.
సమయం కోసం చూసి..
ఎయిర్ పోర్టుకు వచ్చిన తర్వాత సమయం కోసం రమేష్ చూశాడు. రామకృష్ణ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. రాత్రి 7 గంటల సమయంలో పార్కింగ్ ఏరియాకు రామకృష్ణ ఒంటరిగా వచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రమేష్.. రామకృష్ణతో వాగ్వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఆ తర్వాత రమేష్ దాడి చేశాడు. బ్యాగులో ఉన్న కొడవలి తీసి గొంతుకోసి రామకృష్ణను హతమార్చాడు. అక్కడికి చేరుకున్న ఎయిర్ పోర్టు సిబ్బంది రమేష్‌ను దేవనహళ్లి పోలీసులకు అప్పగించారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.