Home » Bengaluru News
మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(ముడా) ఏర్పడింది. సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామం సర్వే నం.464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు.
తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) 19వ గేటుకు స్టాప్‌లాగ్ బిగించేందుకు ఇంజనీయర్లు, కార్మికులు ఏమాత్రం విశ్వాసం సన్నగిల్లకుండా సాహసం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్టాప్‌లాగ్ బిగించేందుకు అనేక అడ్డంకులు ఎదురయినా ఫస్ట్ ఎలిమెంట్‌ను స్పిల్‌వే మీదకు భద్రంగా చేర్చారు.
తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని, ఇంటికి మాత్రం వెళ్లబోనని 34 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ విపిన్ గుప్త బెంగళూరు పోలీసులకు తేల్చి చెప్పారు.
కూడల సంగమ నుంచి బళ్లారి దాకా ప్రత్యేక పాదయాత్ర చేస్తే తనకు అభ్యంతరం లేదని, అధిష్టానం అనుమతితో ఎవరైనా పాదయాత్ర చేయొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) స్పష్టం చేశారు.
ఐటీ హబ్ బెంగళూర్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వీక్ డేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీకెండ్స్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బెంగళూర్ రద్దీ రోడ్డులో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. బైక్స్, కార్లను ఢీ కొట్టి భయాందోళన కలిగించింది. ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. ఒకతను చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. బైక్స్, కార్లు మాత్రం డ్యామేజ్ అయ్యాయి. బస్సు అద్దం కూడా ధ్వంసమైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ ట్రోల్ అవుతోంది. బస్సు డ్రైవర్ తీరును నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది. ఐదుగురిని కేబినెట్ నుంచి తొలగించి ఆరుగురి ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ నమోదుచేసిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుమతులను వాపసు తీసుకోవడంపై దాఖలైన కేసు విచారణ సోమవారం ముగిసింది. దీనిపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో పెట్టింది.
రిటైర్మెంట్ తర్వాత పుట్టిన తేదీ మార్పు సాధ్యం కాదని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంజీఎస్ కమల్ ఏకసభ్య ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది.
బుక్‌బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం వెల్లివిరిసింది. మూడురోజులపాటు సాగిన ఉత్సవంలో వందలాదిమంది తెలుగు రచయితలు, సాహితీ అభిలాషులు పాల్గొన్నారు.
రోజు రోజుకు కొందరు మనుషుల బుద్ధి మరింత గలీజ్‌గా తయారవుతోంది. కామంతో కన్ను మిన్ను కానక వ్యవహరిస్తున్నారు. తాజాగా బెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ షాపులో పని చేసే ఉద్యోగి చెండాలమైన పని చేశాడు.