Home » Bengaluru
పలువురు మహిళలపై లైంగిక దాడులు జరిపిన ఆరోపణలను ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు శుక్రవారం ఉదయం వైద్య పరీక్షలు జరిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పలువురు మహిళా పోలీసు అధికారుల ఎస్కార్ట్‌తో స్థానిక బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలు ఉండటంతో ఆయనకు లైంగిక సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించారని తెలుస్తోంది.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు మలుపులు తిరుగుతోంది. మైసూరు జిల్లా కేఆర్ నగర్ నుంచి ఒక మహిళ అపహరణకు సంబంధించి ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసు పంపింది. జూన్ 1న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
లైంగిక వేధింపుల కేసులో సస్పెండ్ అయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)ను బెంగళూరు(bengaluru)లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిట్ అధికారులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్(arrest) చేశారు.
చికిత్స నిమిత్తం మంగళూరు ఆసుపత్రికి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కేరళకు చెందిన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
మహిళలపై లైంగిక దాడికి పాల్పడటం, అశ్లీల వీడియోలను రికార్డు చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ..
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. కోర్టులో ప్రజ్వల్ పేరుతో ఆయన తరఫు న్యాయవాది అరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.
సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ 2016లో బెల్జియంలో మరణించడంపై హెచ్డీ కుమారస్వామి ప్రశ్నించారు. అప్పుడు సీఎంగా ఉన్న సిద్ధరామయ్య ఎందుకు రాకేష్ మృతిపై దర్యాప్తునకు ఆదేశించలేదని నిలదీశారు.
బెంగళూర్ రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవ్ పార్టీలో సినీ సెలబ్రిటీలు, ఇతరులు పాల్గొన్నారు. పార్టీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న వాహనం ఉంది. మంత్రి, అతని సంబందీకులు ఎవరూ పార్టీలో పాల్గొనలేదని ప్రాథమిక సమాచారం.
బెంగళూరు(Bangalore) అంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఒకప్పుడు ఉద్యాననగరిగా, ఐటీ నగరిగా, ప్రస్తుతం స్టార్టప్‌లకు హబ్‌గా అంతర్జాతీయస్థాయిలో పేరుంది. నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయి.
బెంగళూరుకు చెందిన ఓ మహిళా టెకీ తాజాగా సైబర్ నేరగాళ్ల బారిన పడింది. వారు మాటలు నిజమని భయపడి ఏకంగా రూ. కోటి రూపాయలు నష్టపోయింది.