Bhavani Ravanna: ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణకు సిట్ నోటీసులు..
ABN , Publish Date - May 31 , 2024 | 06:23 PM
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు మలుపులు తిరుగుతోంది. మైసూరు జిల్లా కేఆర్ నగర్ నుంచి ఒక మహిళ అపహరణకు సంబంధించి ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసు పంపింది. జూన్ 1న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
బెంగళూరు: హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Pajwal Revanna) లైంగిక వేధింపుల కేసు మలుపులు తిరుగుతోంది. మైసూరు జిల్లా కేఆర్ నగర్ నుంచి ఒక మహిళ అపహరణకు సంబంధించి ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ (Bhavani Revanna)కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నోటీసు పంపింది. జూన్ 1న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
కిడ్నాప్ కేసులో విచారణకు హాజరుకావాలని ఇంతకుమందు కూడా భవానీ రేవణ్ణకు 'సిట్' నోటీసులు పంపింది. అయితే, ఈ కేసులో విచారణకు తాను సహకరించేందుకు సిద్ధమేనని, హోలెనర్సిపూర్‌లోని చెన్నాంబికా నివాసంలో తాను అందుబాటులో ఉంటానని సిట్‌కు ఆమె సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిట్ తాజా నోటీసులు పంపింది. మహిళా అధికారులతో తమ టీమ్ హోలెనర్సిపూర్‌కు వస్తుందని, శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ అందుబాటులో ఉండాలని ఆ నోటీసులో పేర్కొంది.
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల పోలీసు కస్టడీ
ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు
మరోవైపు, కిడ్నాప్ కేసులో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టును భవానీ రేవణ్ణ ఆశ్రయించారు. ముందస్తు బెయిలు అభ్యర్థనను కోర్టు తిరస్కరించినట్లయితే 'సిట్' విచారణ అనంతరం ఆమెను 'సిట్' అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
For Latest News and National News click here