National: బెంగళూరులో ఒకే రోజు 110 మి.మీ. వర్షం
ABN , Publish Date - Jun 04 , 2024 | 04:39 AM
బెంగళూరు నగరంలో వర్షాలు సాధారణమే. ఏడాదిలో ఏడెనిమిది నెలలపాటు ఇక్కడ వర్షం కురుస్తుంది. అయితే, జూన్ ఆరంభంలోనే ఆదివారం ఒకే రోజు ఏకంగా 110.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 133 ఏళ్ల నాటి రికార్డును బద్ధలు కొట్టింది.
బెంగళూరు, జూన్ 3(ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలో వర్షాలు సాధారణమే. ఏడాదిలో ఏడెనిమిది నెలలపాటు ఇక్కడ వర్షం కురుస్తుంది. అయితే, జూన్ ఆరంభంలోనే ఆదివారం ఒకే రోజు ఏకంగా 110.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 133 ఏళ్ల నాటి రికార్డును బద్ధలు కొట్టింది.
బెంగళూరులో 1891 జూన్ 16న 101.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆ రికార్డును తాజా వర్షం తిరగరాసింది. నగరంలో శని, ఆదివారాలలో మొత్తం 140.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా వర్ష బీభత్సం కొనసాగింది. ఒక్కరోజులోనే 261 విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. 200కు పైగా చెట్లు కూలాయి.