Share News

Prajwal Revanna Scandal: అశ్లీల వీడియోలో కేసులో కస్టడీకి రేవణ్ణ.. ఎన్ని రోజులంటే

ABN , Publish Date - Jun 10 , 2024 | 06:02 PM

అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టైన జేడీఎస్ నేత, హసన్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)కు బెంగళూరు కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ (Judicial Custody) విధించింది. జూన్‌ 24 వరకూ కస్టడీ విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది.

Prajwal Revanna Scandal: అశ్లీల వీడియోలో కేసులో కస్టడీకి రేవణ్ణ.. ఎన్ని రోజులంటే

బెంగళూరు: అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టైన జేడీఎస్ నేత, హసన్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)కు బెంగళూరు కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ (Judicial Custody) విధించింది. జూన్‌ 24 వరకూ కస్టడీ విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) సోమవారం విచారణను పూర్తి చేయడంతో తదుపరి కస్టడీని కోరలేదు.

ఏప్రిల్ 28న ఈ కేసులో రేవణ్ణ అరెస్టయ్యాడు. మరోవైపు ఇదే కేసులో ఆధారాల సేకరణపై సిట్ దృష్టి పెట్టింది. శనివారం ప్రజ్వల్ ఇంట్లో సిట్‌ అధికారులు పలు ఆధారాలు సేకరించారు. ఆ సమయంలో అధికారుల వెంట ప్రజ్వల్‌ కూడా ఉన్నాడు. కాగా, సొంత ఊరికి ప్రజ్వల్‌ను తీసుకువెళ్లిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పో లీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియాను కూడా అనుమతించలేదు.


అయితే ప్రజ్వల్ ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హసన్ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేయగా ఓడిపోయారు. మే 31న జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన రేవణ్ణను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఎన్నికలకు అయిన మరుసటి రోజే.. ఏప్రిల్ 27న ఆయన జర్మనీకి వెళ్లారు.

ఈ కేసులో సిట్ అతనికి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. 100కుపైగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని ఆయన అభియోగాలున్నాయి. ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికలకు ముందు హాసన్‌లో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలు బయటకి వచ్చాయి. అతను 100కుపైగా మహిళలపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీంతో జేడీఎస్ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Updated Date - Jun 10 , 2024 | 06:02 PM