Home » Bengaluru
ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఫైలట్ వెంటనే విమానాన్ని ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందకి దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
గుంతకల్ డివిజన్ తిరుపతి-కట్పడి సెక్షన్(Tirupati-Katpadi Section)లో ట్రాఫిక్ బ్లాక్ కారణంగా ఈ రూట్లో వెళ్లి వచ్చే పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
నేడు ఐపీఎల్ 2024(IPL 2024) లీగ్ దశ కీలక మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ప్లేఆఫ్లో నాలుగో, చివరి సీటు ఎవరికి దక్కుతుందో మరికాసేపట్లో తేలనుంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ అదరగొట్టింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో 68వ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ క్రమంలో స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డులు దక్కించుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
2024 ఐపీఎల్(IPL 2024) 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో 68వ మ్యాచ్ మొదలైన మూడు ఓవర్లకే వర్షం కారణంగా ఆగిపోయి, మళ్లీ 8.25 గంటలకు మొదలైంది. అయితే మళ్లీ మ్యాచ్ ఆగిపోతే ఏం చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.
ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన వరుస విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఆ యా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు (మే 18న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ టాస్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెల్చిన చెన్నై జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకోగా, ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ తీసుకుంది.
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రజల్వ్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మౌనం వీడారు. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉందనే సంకేతాలిచ్చారు. ఈ కేసులో ఎవరెవరికి ప్రమేయం ఉందో వారందరిపైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే వారి పేర్లు తాను చెప్పదలచుకోలేదన్నారు.
న్యూఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
బెంగళూరు మహానగరంలో డెంగ్యూ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ ప్రకటించినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ కమిషనర్ వికాస్ కిషోర్ వెల్లడించారు.