Karnataka: బెంగళూరులో హై అలర్ట్
ABN , Publish Date - May 17 , 2024 | 03:20 PM
బెంగళూరు మహానగరంలో డెంగ్యూ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ ప్రకటించినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ కమిషనర్ వికాస్ కిషోర్ వెల్లడించారు.
బెంగళూరు, మే 17: బెంగళూరు మహానగరంలో డెంగ్యూ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ ప్రకటించినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ కమిషనర్ వికాస్ కిషోర్ వెల్లడించారు. డెంగ్యూ వైరస్ విస్తరించకుండా నివారణ చర్యలు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు. మే 1వ తేదీ నుంచి మే 13వ తేదీ మధ్య ఈ డెంగ్యూ కేసులన్నీ నమోదయ్యాయని చెప్పారు.
AP Elections: జగన్‌కు దెబ్బ.. చెల్లెళ్లకు ఊరట
ఇటీవల నగరంలో భారీ వర్షాలు కురిశాయని.. దీంతో పలు ప్రాంతాల్లో నీరు నిల్వ వల్ల ఈ వైరస్ వ్యాపించిందన్నారు. ఇక మే 16వ తేదీ జాతీయ డెంగ్యూ దినోత్సవమని.. ఈ నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తిపై అరికట్టేందుకు నగర ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కిషోర్ వివరించారు. అలాగే నగరంలో నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను సైతం గుర్తించి.. ఆ యా ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వికాస్ కిషోర్ పేర్కొన్నారు.
LokSabha Elections: ప్లాన్ బీ ఆలోచన లేదు
ఇక ఈ డెంగ్యూ వైరస్ బెంగళూరు మహానగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉందన్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి నేటి వరకు 2,877 డెంగ్యూ కేసులు నమోదు అయితే.. గతేడాది ఇదే సమయంలో 1,725 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు. ఈ డెంగ్యూ కేసులు నివారణకు కర్ణాటక ఆరోగ్య విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టిందని బెంగళూరు మహానగర పాలిక సంస్థ కమిషనర్ వికాస్ కిషోర్ తెలిపారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News