Cancellation of trains: పలురైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
ABN , Publish Date - May 19 , 2024 | 10:53 AM
గుంతకల్ డివిజన్ తిరుపతి-కట్‌పడి సెక్షన్(Tirupati-Katpadi Section)లో ట్రాఫిక్ బ్లాక్ కారణంగా ఈ రూట్‌లో వెళ్లి వచ్చే పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
హైదరాబాద్: గుంతకల్ డివిజన్ తిరుపతి-కట్‌పడి సెక్షన్(Tirupati-Katpadi Section)లో ట్రాఫిక్ బ్లాక్ కారణంగా ఈ రూట్‌లో వెళ్లి వచ్చే పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. మే 27 నుంచి 30 వరకు తిరుపతి-కట్‌పడి-తిరుపతిరైళ్లు(07581) (07660),(07659),(07582), కట్‌పడి-జోలార్‌పెట్టై-కట్‌పడి రైళ్లు(06417)(06418)ను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. మే 28, 30 తేదీల్లో కోయంబత్తూర్-తిరుపతి రైలు(22616), తిరుపతి-ఎస్ఎంవీటి బెంగళూరు రైలు(22617), కట్‌పడి-తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే, మే 27, 29, 30 తేదీల్లో ఎస్‌ఎంవిటి బెంగళూరు-తిరుపతి(22618), తిరుపతి-కోయంబత్తూరు-తిరుపతి రైళ్లు(22615), విల్లుపురం-తిరుపతి(16854), తిరుపతి-విల్లుపురం(16853) రైళ్లను కట్‌పడి-తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ఇక.. తాగునీటికి ఢోకా లేదు..
మే 28, 30 తేదీల్లో ఎస్‌ఎంవిటి బెంగళూరు-హటియా(12836), 27న ఎస్‌ఎంవిటి బెంగళూరు-టాటానగర్(12890) రైలును కట్‌పడి, మెల్‌పక్కం, రేణిగుంట మీదుగా మళ్లించనున్నట్టు తెలిపారు. 27న కాచిగూడ-మధురై రైలు(07191)ను డోన్, గుత్తి, రేణిగుంట, మెల్‌పక్కం, కట్‌పడి మీదుగా మళ్లించనున్నట్టు తెలిపారు. మే 28న న్యూఢిల్లీ-త్రివేండ్రం(12626), ఒఖ-రామేశ్వరం(16734), మే 29న కాకినాడటౌన్-ఎ్‌సఎంవిటి బెంగళూరు (17210) రైలును రేణిగుంట, మేల్‌పక్కం, కట్‌పడి మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News