Home » Bengaluru
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో(IPL 2024) ఈరోజు 30వ మ్యాచ్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తహాతో పాటు బాంబును అమర్చిన ముసావీర్ హుస్సేన్‌ను పశ్చిమబెంగాల్లో అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు శుక్రవారం తెలిపారు.
బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ డ్రైవర్ కేంద్రమంత్రి కారు డ్రైవర్. ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త కూడా బీజేపీకి చెందిన వారే. సోమవారం మధ్యాహ్నం కేఆర్ పురం వద్ద ఈ విషాద ఘటన జరిగింది.
కాంగ్రెస్-కమ్యూనిస్టులపై కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములు.. అయినప్పటికీ వాయనాడులో సీపీఐ తమ అభ్యర్థిగా అన్నీ రాజాను బరిలోకి దింపింది. కూటమి వైఖరికి విరుద్దంగా కమ్యూనిస్టులు వ్యవహరించారని స్మృతి ఇరానీ మండిపడ్డారు.
స్కూటీపై వెళుతున్న ఓ వాహనదారుడిపై గంగిరెద్దు దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. అతడికి ప్రాణాపాయం తప్పిన తీరు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
బెంగళూరులో గల హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్ పోర్టుపై బోయింగ్ విమానం ఇటీవల ఆరుసార్లు చక్కర్లు కొట్టి వెళ్లింది. ఆ భారీ విమానం వచ్చి, వెళ్లే దృశ్యాలను స్థానికులు ఫొటోలు, వీడియోలు తీశారు. మరికొందరు వాటిని సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు.
వ్యవసాయ అవసరాల కోసం వేసే బోరు బావుల్లో నీరు పడకుంటే పూడ్చేయాలి. లేదంటే మూసి వేయాలి. వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో పిల్లల ప్రాణాల మీదకు వస్తోన్నాయి. బోరు బావులను పూడ్చకపోవడంతో చాలా మంది చిన్నారులు అందులో పడి పోయారు. కొందరు ఆ బోరు బావి నుంచి సజీవంగా తిరిగి వస్తే, మరికొందరు ఊపిరాడక చనిపోతున్నారు. కర్ణాటకలో గల లచ్చాయన్ గ్రామంలో ఓ బాలుడు బోరుబావిలో పడిపోయాడు.
కర్ణాటక హైకోర్టులో భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. కోర్టు హాల్ ఒకటిలో హైకోర్టు చీఫ్ జస్టిస్ నీలయ్ విపిన్ చంద్ర అంజారియా, న్యాయవాదులు, తదితరులు ఉన్నారు. మైసూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టు హాల్ ఒకటి వద్దకు వచ్చాడు. అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి ఒక ఫైల్ అందజేశాడు. వెంటనే తనతో పాటు తీసుకొచ్చిన కత్తి తీసుకొని గొంతు కోసుకున్నాడు.
మండు టెండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు పెద్దాయన సర్ప్రైజ్
బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి తన ఇంటికి క్యాబ్‌లో వెళ్లేందుకు రూ.2 వేలు చెల్లించాల్సి రావడంతో ఓ మహిళ దిమ్మెరపోయింది.