Share News

Bengalure: కేంద్రమంత్రి కారు డోర్ తగిలి కిందపడ్డ కార్యకర్త.. ఏం జరిగిందంటే..?

ABN , Publish Date - Apr 08 , 2024 | 08:27 PM

బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ డ్రైవర్ కేంద్రమంత్రి కారు డ్రైవర్. ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త కూడా బీజేపీకి చెందిన వారే. సోమవారం మధ్యాహ్నం కేఆర్ పురం వద్ద ఈ విషాద ఘటన జరిగింది.

Bengalure: కేంద్రమంత్రి కారు డోర్ తగిలి కిందపడ్డ కార్యకర్త.. ఏం జరిగిందంటే..?
BJP Worker Dies After Crashing Two-Wheeler Into Union Minister's Car In Bengaluru

బెంగళూర్: బెంగళూరులో (Bengaluru) ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ డ్రైవర్ కేంద్రమంత్రి కారు డ్రైవర్. ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త కూడా బీజేపీకి (BJP) చెందిన వారే. సోమవారం మధ్యాహ్నం కేఆర్ పురం వద్ద ఈ విషాద ఘటన జరిగింది.


ఏం జరిగిందంటే..?

కేంద్రమంత్రి, బెంగళూర్ నార్త్‌ లోక్ సభ నుంచి పోటీ చేస్తోన్న శోభ కర్లందాజే కారు డోర్ తగిలి ప్రకాశ్ అనే కార్యకర్త పడిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో శోభ కర్లందాజే లేరు. మంత్రి డ్రైవర్ చూసుకోకుండా మరో పక్క నుంచి డోర్ తీశాడు. ఆ సమయంలో స్కూటర్ మీద ప్రకాశ్ వస్తున్నాడు. స్కూటీ స్పీడ్‌గా ఉండగా.. డోర్ తగిలి ప్రకాష్ పడిపోయాడు. ఆ వెంటనే ప్రకాష్ పైనుంచి బస్సు వెళ్లింది. అక్కడికక్కడే ప్రకాష్ చనిపోయాడు.


శోభ వాదన ఇలా..?

ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్, బస్సు డ్రైవర్ ఇద్దరి నిర్లక్ష్యంతో ఒకతని మరణానికి కారణమయ్యారని కేసు నమోదు చేశారు. ఘటనపై కేంద్రమంత్రి శోభ కర్లందాజే మాట్లాడారు. ‘తమ పార్టీకి చెందిన కార్యకర్తకు ప్రమాదం జరిగిందని తెలిసింది. ఆ సమయంలో ర్యాలీలో తాను ఉన్నా. రోడ్డు చివరలో తన కారు నిలిపాం. ప్రకాష్ నేరుగా వచ్చి తన కారును ఢీ కొని కిందపడిపోయాడు. తర్వాత ప్రకాష్ మీద నుంచి బస్సు వెళ్లింది అని’ కేంద్రమంత్రి అన్నారు. కేంద్రమంత్రి తీరును కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పు పట్టారు. డ్రైవర్‌ను కాపాడేందుకు శోభ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.


ఇది కూడా చదవండి:

Rahul Gandhi: 'అగ్నివీర్'కు ఆర్మీ కూడా వ్యతిరేకమే, మేం వస్తే రద్దు చేస్తాం

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 08 , 2024 | 08:27 PM