Smriti Irani: కాంగ్రెస్-కమ్యూనిస్టులు ఢిల్లీలో హగ్గింగ్, కేరళలో బెగ్గింగ్.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విసుర్లు
ABN , Publish Date - Apr 06 , 2024 | 04:58 PM
కాంగ్రెస్-కమ్యూనిస్టులపై కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములు.. అయినప్పటికీ వాయనాడులో సీపీఐ తమ అభ్యర్థిగా అన్నీ రాజాను బరిలోకి దింపింది. కూటమి వైఖరికి విరుద్దంగా కమ్యూనిస్టులు వ్యవహరించారని స్మృతి ఇరానీ మండిపడ్డారు.
బెంగళూర్: కాంగ్రెస్-కమ్యూనిస్టులపై కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ (Smriti Irani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములు.. అయినప్పటికీ వాయనాడులో సీపీఐ తమ అభ్యర్థిగా అన్ని రాజాను బరిలోకి దింపింది. కూటమి వైఖరికి విరుద్దంగా కమ్యూనిస్టులు వ్యవహరించారని స్మృతి ఇరానీ మండిపడ్డారు. కమ్యూనిస్ట్ పార్టీ వైఖరి ఢిల్లీలో (delhi)- ఆలింగనం చేసుకొని, కేరళలో (Kerala) పోరాటం చేసినట్టు ఉందని విమర్శించారు. ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉత్తరప్రదేశ్ నుంచి ఎందుకు పోటీ చేయడం లేదని అడుగుతారు. తర్వాత వారే రాహుల్ గాంధీని హగ్ చేసుకుంటారు. ఆ పార్టీ వైఖరి ఢిల్లీలో హగ్గింగ్.. కేరళలో బెగ్గింగ్లలా ఉందని అని తీవ్ర విమర్శలు చేశారు.
బరిలోకి అన్నీ రాజా
వాయనాడులో సీపీఐ తరఫున డీ రాజా సతీమణీ అన్నీ రాజా బరిలో దిగారు. దీంతో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య వాయనాడులో మాత్రం పోటీ ఉంటుంది. కేరళలో మాత్రం ఆ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుందని స్పష్టం అయ్యింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు వాయనాడులో అభ్యర్థిని ఖరారు చేశాయి. బీజేపీ కూడా తమ క్యాండేట్‌ను ఫైనల్ చేసింది. ఇద్దరు ఉద్దండులు ఉండటంతో కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ బరిలోకి దింగారు.
ఇవి కూడా చదవండి:
West Bengal: దీదీతో గొడవకు కారణం ఆ మంత్రే.. బెంగాల్ గవర్నర్ సంచలనం
Maharashtra: కల్యాణ్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలోకి షిండే కుమారుడు..? ఫడ్నవీస్ ఏమన్నారంటే..?
మరిన్ని జాతీయ వార్తల కోసం