Home » bharat jodo yatra
కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో హాజరయ్యేందుకు సుల్తాన్‌పూర్ జిల్లా సివిల్ కోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కోర్టు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో సోమవారంనాడు ప్రవేశించిన రాహుల్ గాంధీ "భారత్ జోడో న్యాయ్ యాత్ర''లో మంగళవారం ఉదయం స్పల్ప విరామం చోటుచేసుకోనుంది. తనపై దాఖలైన పరువునష్టం కేసులో సుల్తాన్‌పూర్‌లోని జిల్లా సివిల్ కోర్టు ముందు రాహుల్ గాంధీ ఈనెల 20న హాజరుకానుండటంతో ఈ విరామం తలెత్తింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఈరోజు యూపీలోని ప్రతాప్‌గఢ్ మీదుగా అమేథీకి చేరుకుంది. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీకి షాకిచ్చారు.
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ఉత్తరప్రదేశ్ లో అడుగుపెడుతున్న వేళ సమాజ్‌వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ యాత్రలో పాల్గొంటారా అనే సస్పెన్స్ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ ఖరారైతేనే యాత్రలో పాల్గొనాలని సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాల తాజా సమాచారం.
దేశాన్ని ఏకం చేయడమే నిజమైన దేశభక్తి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ధనికులు, పేదలు అనే భావన పోయి అందరూ సమానం అనే భావన వచ్చినప్పుడే సమగ్ర అభివృద్ధి జరిగినట్లు అవుతుందని పేర్కొన్నారు.
'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో భాగంగా బీహార్ లోని మోహనియాలో యువతను ఉద్దేశించి రాహుల్ గాంధీ శుక్రవారంనాడు మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం యువతను కాంట్రాక్ట్ లేబర్లుగా మారుస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ సమాచారాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
రాహుల్ గాంధీ బుధవారంనాడు జార్ఖాండ్‌లో రెండో విడత చేపట్టాల్సిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' రద్దయింది. ఢిల్లీలో రైతులు జరుపుతున్న ఆందోళనలో పాలుపంచుకునేందుకు ఆయన వెళ్లడంతో ఈ కార్యక్రమం రద్దయినట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. గురువారం బీహార్‌లోని ఔరంగాబాద్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని ప్రకటించింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ప్రముఖ వాణిజ్యవేత్తలు వంటివారే కనిపించారని, చూద్దామన్నా ఎక్కడా పేదలు, కార్మికులు, రైతులు కనిపించ లేదని అన్నారు.
రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ఉత్తరప్రదేశ్ షెడ్యూల్‌లో సవరణలు చోటుచేసుకున్నాయి. యూపీ బోర్డ్ ఎగ్జామ్స్ కారణంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఫిబ్రవరి 14వ తేదీకి బదులుగా ఇప్పుడు 16వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోకి అడుగుపెడుతుంది.