Share News

Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు మరో షాక్..ఎస్పీ చీఫ్ కీలక ప్రకటన

ABN , Publish Date - Feb 19 , 2024 | 02:36 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఈరోజు యూపీలోని ప్రతాప్‌గఢ్ మీదుగా అమేథీకి చేరుకుంది. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీకి షాకిచ్చారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు మరో షాక్..ఎస్పీ చీఫ్ కీలక ప్రకటన

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఈరోజు యూపీలోని ప్రతాప్‌గఢ్ మీదుగా అమేథీకి చేరుకుంది. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(akhilesh yadav) రాహుల్ గాంధీకి షాకిచ్చారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ రాహుల్ గాంధీ పర్యటనకు హాజరుకావడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అమేథీ, రాయ్‌బరేలీలకు కూడా వెళ్లడం లేదని స్పష్టం చేశారు. భారత్ జోడో న్యాయ యాత్రలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు ఎవరూ పాల్గొనరని ఆయన అన్నారు.


సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్(Congress) సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకున్న తర్వాతే రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటామని చెప్పారు. ప్రస్తుతం సీట్లపై చర్చలు కూడా జరుగుతున్నాయని అన్నారు. సీట్ల పంపిణీ కాగానే న్యాయ యాత్రలో పాల్గొంటామని వెల్లడించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఎస్పీ(SP) అధినేత అఖిలేష్ యాదవ్‌ను కాంగ్రెస్ ఇప్పటికే ఆహ్వానించింది. నేడు నాటికి సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. దీని తర్వాత కూటమి పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అయితే ఎస్పీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల ఫార్ములాపై దాదాపు 2 నెలలుగా చర్చలు జరుగుతున్నా ఇప్పటి వరకు సీట్ల పంపకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ సిద్ధంగా ఉందని, అయితే కాంగ్రెస్ 21 నుంచి 22 సీట్లు డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. ఇరు పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్న ముస్లింల ప్రాబల్యం ఉన్న స్థానాలపై ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిసింది. ఇక అఖిలేష్ ఈ ప్రకటన నేపథ్యంలో అసలు పొత్తు విషయంలో స్పష్టత వస్తుందా లేదా ఇంకొన్ని రోజులు పడుతుందా అనేది తేలాల్సి ఉంది.

Updated Date - Feb 19 , 2024 | 02:36 PM