Home » Bharath
మన దేశం పేరును ‘భారత్’గా పునరుద్ధరించబోతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ‘ఇండియా’ పేరుపై హక్కును పాకిస్థాన్ కోరుతుందా? అనే అంశం తెరపైకి వచ్చింది.
మోదీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతోందా? ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ అని తీసుకురానుందా..? విపక్షాల ‘ఇండియా’ కూటమికి భయపడే ఇలా పేరు మార్చుతోందా..? తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు
నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం (Central Govt) త్వరలో దేశం పేరు మార్చబోతుందన్న వార్త ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారింది. మన దేశం పేరును ‘ఇండియా’ (India) అని కాకుండా జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో ‘భారత్’ (Bharat) అని పేర్కొనడం ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశం అవుతోంది...
దేశంలోని ప్రజలందరి దగ్గర ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంది. ఆయా కార్డులన్నింటిపైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే ఉంటుంది. ఇప్పుడు దేశం పేరు మారిస్తే గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని కార్డులపై ఉండాలి. లేకపోతే గుర్తింపు కార్డులు చెల్లే అవకాశాలు ఉండవు. దీంతో ప్రజలు మరోసారి ప్రభుత్వ కార్యాలయాల ముందు బారులు తీరి వాటిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
ఇండియా అంటే బానిసత్వ చిహ్నమని చెప్తూ, ప్రాచీన కాలంనాటి పేరు అయిన ‘భారత్’ను తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ప్రచారం ఊపందుకోవడంతో వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చబోతున్నట్లు విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలనం సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, డిజిటల్ ఇండియా, చంద్రయాన్-3 వంటివాటి సరసన దేశం పేరు మార్పు కూడా జత కలవబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 9న రాష్ట్రపతి భవన్లో విందు ఇస్తున్నారని, ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికల్లో మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పేర్కొన్నారని మండిపడింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వచ్చే వారం న్యూఢిల్లీ రాబోతున్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ఆయన ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
మన దేశం హిందూ దేశమని, దీనిని ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) అన్నారు. మన దేశంలో ఉన్నవారందరినీ తెలియజేసే పదమే హిందూ అని చెప్పారు.