Home » Bhatti Vikramarka Mallu
ఒడిసాలో ఐదో దశ ఎన్నికలు జరిగే లోక్‌సభ నియోజక వర్గాల్లో డిప్యూటీ సీఎం భట్టి విస్తృత ప్రచారం చేపట్టారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆయన ఒడిసాలోనే మకాం వేసి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్ ముగిసిన అనంతరం మంగళవారమే ఆయన ఢిల్లీకి వెళ్లారు. బుధవారం అక్కడి నుంచి ఏఐసీసీ అగ్రనేతలతో పాటుగా ప్రత్యేక విమానంలో ఒడిసాకు వెళ్లిన భట్టి.. బోలాంగిరి పరిధిలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు.
Telangana: ‘‘ప్రభుత్వాన్ని కాపాడుకునే సత్తా మాకుంది. మేం 11 మందిమి మంచి టీమ్‌గా పని చేస్తున్నాం. మా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదు. రేవంత్ సీఎంగా, భట్టి డిప్యూటీ సీఎంగా, మేం మంత్రులుగా కలిసి పనిచేస్తున్నాం. మేమంతా క్రికెట్ టీంలా పనిచేస్తున్నాం’’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు.
Telangana: దేశ సంపదను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెట్టుబడిదారులకు పంచి పెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... నామా నాగేశ్వరరావును కేసీఆర్ ఏ పార్టీ నుంచి కేంద్ర మంత్రిని చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్క సీట్ కూడా గెలవని బీఆర్ఎస్ నుంచి నామా ఎలా మంత్రి అవుతారని నిలదీశారు.
దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీలుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గుర్తింపు పొందాయని, ఎన్నికల బాండ్ల పేరుతో జరిగిన అవినీతిలోనే ఇది రుజువైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తెలంగాణ నుంచి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉన్నారు.
రైతు భరోసా, పంటల బీమా, రుణ మాఫీ పథకం విధి విధానాలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఈ అంశంపై చర్చించారు. పంట రుణాల రికవరీ కోసం రైతులను ఇబ్బందికి గురి చేయొద్దని బ్యాంకులకు, పరపతి సంఘాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 5 ఏళ్లలో సగం రోజులు మాత్రమే సీఎంగా ఉంటారని.. ప్రతిపక్షాలు తరచూగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి (Maheswara Reddy) కూడా హాట్ కామెంట్స్ చేశారు.
తుక్కుగూడ ‘జన జాతర’ భారీ బహిరంగ సభకు నేడు(శనివారం) కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చిది. ఈ బహిరంగ సభలో రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కాన్వాయిని అనుమతించకుండా అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం సిబ్బంది చెబుతున్న వినకుండా అడ్డుపడ్డారని చెప్పారు.
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్ (Congress) మాత్రమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. తుక్కుగూడలోని ‘ జన గర్జన’ సభ ఏర్పాట్లను గురువారం నాడు పరిశీలించారు.
తెలంగాణ ప్రజలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) మోయలేని భారం మోపారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాడు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ చెప్పేవన్నీ కట్టు కథలేనని అన్నారు.