TG Politics: ఆ సంస్థతో సీఎం రేవంత్ వేలకోట్ల సెటిల్మెంట్లు.. బీజేపీ నేత మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Apr 11 , 2024 | 04:59 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 5 ఏళ్లలో సగం రోజులు మాత్రమే సీఎంగా ఉంటారని.. ప్రతిపక్షాలు తరచూగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి (Maheswara Reddy) కూడా హాట్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 5 ఏళ్లలో సగం రోజులు మాత్రమే సీఎంగా ఉంటారని.. ప్రతిపక్షాలు తరచూగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి (Maheswara Reddy) కూడా హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ అంటే.. వంతుల వారిగా అని.. తన వంతు ముఖ్యమంత్రిగా పదవీ కాలం ఎన్నిరోజులని ఢిల్లీ కాంగ్రెస్ హై కమాండ్‌ను అడగటానికి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారని మహేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు.
KTR: పూలే ఎంచుకున్న మార్గం అందరికీ ఆచరణీయం..
గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని అడ్డు పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి వేల కోట్లు సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. సొంత మనుషులతో కలిసి రేవంత్ ధరణిపై కన్నేశారని విమర్శించారు. హెటిరో డగ్స్ అధినేత పార్థసారథిరెడ్డికి చెందిన 15ఎకరాల భూమి విషయంలో భారీ సెటిల్మెంట్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.
గతంలో పార్థసారథిరెడ్డికి ఇచ్చిన భూమిపై కోర్టుకెళ్లిన రేవంత్.. ఇప్పుడు ఆయనతో ఎలా సెటిల్మెంట్లు చేసుకున్నారని ప్రశ్నించారు. జీవో నంబర్ 37తో పార్థసారథిరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సహకరించారని విమర్శించారు. ప్రభుత్వ రేటు ప్రకారం పార్థసారథిరెడ్డికి ఇచ్చిన భూమి విలువ రూ. 505కోట్లు ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై రేవంత్.. రీ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఆక్షేపించారు.
Revanth Reddy: ఢిల్లీకి రేవంత్.. ఈసారైనా క్లారిటీ వస్తుందా?
గత కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేయకుండా.. రేవంత్ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణలో జరుగుతోన్న .. ఆర్, బీ.. టాక్స్‌పై బీజేపీ దగ్గర ఆధారాలున్నాయని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ పోగానే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభద్రతాభావంలో ఉన్నారన్నారు. అవినీతి ఆధారాలు బయటకు వస్తున్నాయని.. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సచివాలయంలో ఆరో అంతస్తును బంద్ చేయించారని మహేశ్వరరెడ్డి సెటైర్లు గుప్పించారు.
ఇవి కూడా చదవండి
Padi Koushik Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలను వదిలి పెట్టం
CM Revanth: ధాన్యం కొనుగోళ్లల్లో నిర్లక్ష్యం వహించొద్దు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...