Home » Bhatti Vikramarka Mallu
లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా పనిచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) ఎన్నికల్లో ఇచ్చిన హమీల అమలు కోసం ‘‘అభయహస్తం’’ పేరిట దరఖాస్తులను స్వీకరించింది. అయితే కొంతమంది సైబర్ నేరగాళ్లు లబ్ధిదారులను మోసం చేస్తున్నారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) ప్రశ్నించారు. ఆదివారం నాడు వైరా మండలం స్థానాల లక్ష్మీపురం గ్రామంలో మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ‘‘తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని కోరాం. సోనియా గాంధీ పోటీ చేసే పార్లమెంటు స్థానం నుంచి తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీలు పోటీ చేయొద్దు’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ ( BRS ) అడ్డుకుంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు. శనివారం నాడు ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించకపోతే బాగుంటుందని.. బీఆర్ఎస్ ( BRS ) , బీజేపీ ( BJP ) కలలు కంటున్నాయని.. వారి కలలను నిజం కానివ్వబోమని త్వరలోనే హామీలను అమల్లోకి తీసుకువస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) ని గురువారం రాత్రి ప్రజాభవన్‌లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి విక్రమార్క సత్కారం చేశారు.
Telangana: బీటీపీఎస్‌ను పరిశీలించడానికి, అవగాహన చేసుకోవడానికి, రివ్యూ రూపేనా తెలుసుకున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..విద్యుత్ సెక్టార్‌ను గత ప్రభుత్వం అప్పుల ఊబిగా మార్చిందని విమర్శించారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) పేర్కొన్నారు. మంగళవారం నాడు ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానమంత్రిని నరేంద్రమోదీని కలిశారు. ప్రధాని మోదీతో అరగంటపాటు సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో చర్చించిన పలు అంశాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ...రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిశామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ప్రధానమంత్రి మోదీ ( PM Modi )తో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మోదీ నివాసానికి రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క చేరుకున్నారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశం అరగంట పాటు కొనసాగింది. ఈ భేటీ అనంతరం తెలంగాణ భవన్‌కి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు. తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. రేవంత్‌రెడ్డి సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తొలిసారిగా ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
Telangana: తెలంగాణ భవన్లో మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు వర్ధంతి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై నివాళులర్పించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ..పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీ సొంతమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై భట్టి మాట్లాడుతూ.. రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. పదేళ్లలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజలకు చెప్పాల్సిన భాధ్యత తమపై ఉందన్నారు.