Share News

CM Revanth Reddy: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే..?

ABN , Publish Date - Dec 26 , 2023 | 04:22 PM

ప్రధానమంత్రి మోదీ ( PM Modi )తో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మోదీ నివాసానికి రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క చేరుకున్నారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశం అరగంట పాటు కొనసాగింది. ఈ భేటీ అనంతరం తెలంగాణ భవన్‌కి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు. తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. రేవంత్‌రెడ్డి సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తొలిసారిగా ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

CM Revanth Reddy: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి  భేటీ..  ఏం చర్చించారంటే..?

ఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ ( PM Modi )తో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మోదీ నివాసానికి రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క చేరుకున్నారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశం అరగంట పాటు కొనసాగింది. ఈ భేటీ అనంతరం తెలంగాణ భవన్‌కి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు. తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. రేవంత్‌రెడ్డి సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తొలిసారిగా ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

1rb.jpg

కాగా.. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టుల గురించి చర్చ, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో ఏఐసీసీ అగ్ర నేతలను కలిసి మంత్రవర్గ విస్తరణ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది.

Updated Date - Dec 26 , 2023 | 06:25 PM