Home » Bhatti Vikramarka Mallu
రైతు భరోసా (Rythu Bharosa) పథకం అమలుపై రేవంత్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలనే అంశంపై క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకుంటుంది.
రాష్ట్రంలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు వారి డిమాండ్ల సాధన కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే.. కనీసం స్పందించకపోగా.. ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
ప్రస్తుత పరిస్థితుల్లో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయడం కుదరదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇదే చివరి డీఎస్సీ కాదని.. మరిన్ని ఉంటాయని చెప్పారు. త్వరలో 5 వేల నుంచి 6 వేల పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.
‘‘ప్రభుత్వాన్ని పడగొడతామని అచ్చోసిన ఆంబోతుల్లా బీఆర్ఎస్, బీజేపీ వాళ్లు అంటే.. మేం నిలబెడతామని ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నరు. తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సర్కారుకు అండగా ఉంటామంటున్నరు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
KCR ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ , యువతీ యువకులకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
బ్యాటరీల్లో వాడే అరుదైన ఖనిజ నిక్షేపాలకు సంబంధించి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ కోల్ మైనింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్’ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాలను సాధించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఖజానాను నింపేందుకు ప్రతి విభాగం కృషి చేయాలన్నారు.
రైతు భరోసా అమలు విధివిధానాలపై రైతుల నుంచి సలహాలు, సూచనల కోసం ఉమ్మడి పది జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన వర్క్‌షాప్ కార్యక్రమానికి ప్రభుత్వం కదిలింది. బుధవారం తొలి వర్క్‌షా్‌పను ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించారు.
జాతీయ రహదారులకు భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా చూడాలని అన్నారు.