Share News

Bhatti Vikramarka: డీఎస్సీ రద్దు కుదరదు.. డిప్యూటీ సీఎం కీలక విజ్ఞప్తి

ABN , Publish Date - Jul 14 , 2024 | 05:15 PM

KCR ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ , యువతీ యువకులకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

Bhatti Vikramarka: డీఎస్సీ రద్దు కుదరదు.. డిప్యూటీ సీఎం కీలక విజ్ఞప్తి
Mallu Bhatti Vikramarka

హైదరాబాద్: KCR ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ , యువతీ యువకులకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాలకోసమని తెలిపారు. అనేక ఉద్యమాలు, విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. అందుకే తమ ప్రభుత్వం ఉద్యోగాలపై దృష్టి పెట్టి 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని వెల్లడించారు.


ALSO READ: Rakesh Reddy: నిరుద్యోగులపై రేవంత్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి

విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్యానందించాలని డీఎస్సీ ప్రకటించామని తెలిపారు. ఈరోజు( ఆదివారం) గాంధీభవన్‌లో భట్టివిక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. పదేళ్లు డీఎస్సీని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్లకోసం తాపాత్రయ పడ్డారని విమర్శించారు. 5వేల నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించకపోవడంతో తమ ప్రభుత్వం రాగానే 11వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తుచేశారు.


ALSO READ: Harish Rao:రాజకీయాల్లో అలా ఉండటం చాలా అరుదు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

16వేల టీచర్ పోస్టులుఖాళీగా ఉన్నట్టు గుర్తించామని, 19,718 టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టామని వివరించారు. ఇప్పటికే అభ్యర్థులు హాల్ టికెట్లు 2లక్షల 500కు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని వివరించారు. మొత్తం 2లక్షల 79వేలమంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కొంతమంది పోస్ట్‌పోన్ చేయమని ధర్నాలు చేస్తున్నారని అలా చేయడం తగదని దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ప్రకటించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువకులు నష్టపోయిన విషయాన్ని గుర్తించామని అన్నారు.


ALSO READ: CM Revanth: 'కాటమయ్య రక్ష కిట్ల' పంపిణీ‌లో సీఎం కీలక నిర్ణయాలు

గ్రూప్ 2 కూడా గత ప్రభుత్వం మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేసిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. గ్రూప్ 3 కూడా నిర్వహించలేకపోతే మళ్లీ తాము షెడ్యూల్ చేశామని అన్నారు. ఇవన్నీ నిరుద్యోగులకు నష్టం కలగొద్దని తమ ప్రయత్నమని వివరించారు. ఇవి కాక వివిధ శాఖల్లో పోస్టులు 13321 టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నామని తెలిపారు.

డీఎస్సీని కూడా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు.త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. అందరూ మంచిగా ప్రిపేరై ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కోరుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు

Kakinada: చదవటం లేదని విద్యార్థినిని చితకబాదిన టీచర్

Gudivada: కొడాలి నాని సన్నిహితుడి బంకులో కల్తీ పెట్రోలు.. సగానికిపైగా నీళ్లే..!

Anitha: ఏపీలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 06:57 PM