Home » Bhupalpalle
లైంగిక వేధింపుల ఆరోపణలతో రెండేళ్ల క్రితం వేటు పడ్డా ఆ పోలీసు అధికారి బుద్ధి తెచ్చుకోలేదు. గతంలో పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతున్న ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడి సస్పెండైనా పద్ధతి మార్చుకోని ఆ అధికారి కొన్నాళ్లుగా సహచర ఉద్యోగినిపైనే కన్నేశాడు.
అడవిలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు.. కట్టెల కోసం వెళ్లిన ఓ వ్యక్తి బలయ్యాడు. ఈ సంఘటన ములుగు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వాజేడు మండలంలోని జగన్నాథపురానికి చెందిన ఇల్లెందుల ఏసు (55) తన కుమారుడు రమేశ్, మరో ముగ్గురితో కలిసి కట్టెల కోసమని కొంగాల అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు.
మేడిగడ్డ ప్రాజెక్టు ఏడో బ్లాక్ పునాదుల కింద అగాధం ఏర్పడిన నేపథ్యంలో వాటిని పూడ్చి పునాదులను పటిష్టం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాలు పడి, మేడిగడ్డ వద్ద ప్రవాహం మొదలు కావడానికి కేవలం 2వారాల సమయం మాత్రమే ఉంది.
మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన గోదావరి వరదను మళ్లించడానికి జియో ట్యూబ్ సాంకేతికతతో నిర్మించ తలపెట్టిన కట్టపై చీఫ్ ఇంజనీర్ల(బీవోసీఈ) బోర్డు సమావేశం చర్చించింది. నీటిపారుదలశాఖలోని బీవోసీఈ హాలులో ఈ సమావేశం శుక్రవారం జరిగింది.
మేడిగడ్డ మరమ్మతులకు మరో గండం వచ్చి పడింది. మొత్తం బ్యారేజీ కింద పెద్ద అగాధం ఉన్నట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు తేల్చారు. మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల బ్యారేజీ అడుగున పెద్ద అగాధం ఏర్పడిందని అంచనాకు వచ్చారు.
భూపాలపల్లి జిల్లా: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గురువారం భూపాలపల్లిలో పర్యటించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి గ్రాడ్యూయేట్ ఎన్నిక జరిగినప్పుడల్లా మనమే గెలిచామని, బిట్స్ పిలానిలో గోల్డ్ మెడలిస్ట్ ఆయన రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపిచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ, అన్నారం సరస్వతి బ్యారేజీలను పుణేకు చెందిన కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులు బుధవారం పరిశీలించారు. ఆ సంస్థలోని భూభౌతిక, భూసాంకేతిక, నాన్ డిస్ట్రక్టివ్ విభాగాలకు చెందిన ముగ్గురు నిపుణులు..
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల మృతదేహాలు చల్లగరిగ గ్రామానికి చేరుకున్నాయి. మూడు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో సుధాకర్ దంపతులు చనిపోయారు. సుధాకర్ దంపతుల చివరిచూపు కోసం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు.
హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ వెళుతుండగా.. ఈ పర్యటనకు దూరంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ప్రభుత్వం మేడిగడ్డకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు సమాన దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది.
భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూపాలపల్లి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడు రడపాక సారయ్య ఎలక్షన్ విధులు నిర్వహిస్తుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆస్పత్రిలో సారయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని నిరసిస్తూ భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు రాస్తారోకోకు దిగారు.