Share News

Medigadda Barrage: దీర్ఘకాలం జియో ట్యూబ్‌ మన్నిక

ABN , Publish Date - May 25 , 2024 | 03:08 AM

మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన గోదావరి వరదను మళ్లించడానికి జియో ట్యూబ్‌ సాంకేతికతతో నిర్మించ తలపెట్టిన కట్టపై చీఫ్‌ ఇంజనీర్ల(బీవోసీఈ) బోర్డు సమావేశం చర్చించింది. నీటిపారుదలశాఖలోని బీవోసీఈ హాలులో ఈ సమావేశం శుక్రవారం జరిగింది.

Medigadda Barrage: దీర్ఘకాలం జియో ట్యూబ్‌ మన్నిక

  • ఇప్పటికే బ్రహ్మపుత్ర బేసిన్‌లో వినియోగం

  • తరలింపు, అమరిక, మరమ్మతు సులువు

  • చీఫ్‌ ఇంజనీర్లకు వివరించిన సంస్థ

  • మరమ్మతు కూడా సాధ్యం

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన గోదావరి వరదను మళ్లించడానికి జియో ట్యూబ్‌ సాంకేతికతతో నిర్మించ తలపెట్టిన కట్టపై చీఫ్‌ ఇంజనీర్ల(బీవోసీఈ) బోర్డు సమావేశం చర్చించింది. నీటిపారుదలశాఖలోని బీవోసీఈ హాలులో ఈ సమావేశం శుక్రవారం జరిగింది. దీనికన్నా ముందు వీరేంద్ర టెక్స్‌టైల్‌ అనే సంస్థ జియో ట్యూబ్‌ సాంకేతికతపై పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌ ద్వారా వివరించింది. దేశంలో తొలిసారిగా 2010లో బ్రహ్మపుత్ర బేసిన్‌లో వరదల నుంచి రక్షణ కోసం 5 కిలోమీటర్ల వరకు కరకట్టలుగా జియో ట్యూబ్‌లను వినియోగించడం జరిగిందని తెలిపింది.


5 కిలోమీటర్ల దాకా దాదాపు 6 లక్షల జనాభాకు వరద నుంచి రక్షణ అందించడంలో వీటి పాత్ర కీలకంగా ఉందని వారు వివరించారు. అసోంలోని కొప్పిలి, సెస్సా, సింగ్రి, రాఫ్తి, ఖో, ఘాగ్రా వంటి నదుల వరద నుంచి రక్షణ కోసం ఈ సాంకేతికతని వినియోగించడం జరిగిందని గుర్తుచేశారు. తాత్కాలిక కట్ట కోసం జియో ట్యూబ్‌లను తరలించడం... నింపడం చాలా తేలిక అని నివేదించారు. ట్యూబ్‌లు దెబ్బతిన్నా వాటిని మరమ్మతు చేయడానికి వీలుంటుందని వివరించారు. వినియోగించినా మళ్లీ మళ్లీ వాడటానికి వీలుండడం జియో ట్యూబ్‌ ప్రత్యేకత అన్నారు.

Updated Date - May 25 , 2024 | 03:08 AM