Share News

BRS: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్నీ తుస్సుమన్నాయి: హరీష్ రావు

ABN , Publish Date - May 23 , 2024 | 01:59 PM

భూపాలపల్లి జిల్లా: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గురువారం భూపాలపల్లిలో పర్యటించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి గ్రాడ్యూయేట్ ఎన్నిక జరిగినప్పుడల్లా మనమే గెలిచామని, బిట్స్ పిలానిలో గోల్డ్ మెడలిస్ట్ ఆయన రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపిచ్చారు.

BRS: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్నీ తుస్సుమన్నాయి: హరీష్ రావు

భూపాలపల్లి జిల్లా: బీఆర్ఎస్ సీనియర్ నేత (BRS Senior Leader), మాజీ మంత్రి హరీష్ రావు (Ex Minister Harishrao) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై విమర్శలు (Comments) గుప్పించారు. గురువారం భూపాలపల్లి (Bhupalpalli)లో పర్యటించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో (MLC Election Campaign Meeting) పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి గ్రాడ్యుయేట్‌ ఎన్నిక (Graduate Election)జరిగినప్పుడల్లా మనమే గెలిచామని, బిట్స్ పిలానిలో గోల్డ్ మెడలిస్ట్ ఆయన రాకేష్ రెడ్డిని (Rakesh Reddy) గెలిపించుకోవాలని పిలుపిచ్చారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ తుస్సుమన్నాయని, కాంగ్రెస్ ప్రచారంలో 6 గ్యారంటీల్లో ఐదు అమలు చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయిందని హరీష్ రావు విమర్శించారు. ఉపాధ్యాయుల మీద లాఠీ ఛార్జ్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని ఆరోపించారు. సన్న బియ్యానికే మద్దతు ధర ఇస్తారట.. మన తెలంగాణాలో దొడ్డు బియ్యం ఎక్కువగా పండిస్తామని... పండించిన రైతుల పరిస్థితి ఎంటని ఆయన ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు పెంచిందని, మహిళా గ్రాడ్యుయే‌ట్‌‌లు కూడా బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తున్నారన్నారు. మహిళా పథకం కింద వారికి నెలకు రూ. 2,500 ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. నిన్న వరంగల్ ఎంజీఎంలో కరెంట్ పోయిందన్నారు. విద్యుత్ ఉద్యోగులను కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ నేత డీజే శివపై వైసీపీ మూకల దాడి..

నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్..

టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 23 , 2024 | 02:01 PM