Home » Bhuvanagiri
యాదాద్రి: భక్తుల ఇలవేల్పు దైవం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు గురువారం ఉదయం వట పత్ర శాయి అలంకార సేవలో లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
యాదగిరిగుట్ట, మార్చి 10: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10గంటలకు ప్రధానాలయ ముఖ మండపంలో అర్చక, వేదపండితుల బృందం సంప్రదాయరీతిలో లక్ష్మీనృసింహుల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Telangana Results: భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగరాసింది. గత 40 ఏళ్లుగా భువనగిరిలో విజయం సాధించని కాంగ్రెస్.. ఈసారి పార్టీ జెండాను ఎగురవేసింది. భువనగిరిలో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు.
యాదాద్రి భువనగిరి: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని ఇక్కడున్న చిన్న దుకాణాలు, రైతులు, విద్యార్థులు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఎంతో కష్టపడుతున్నారని ఈ విషయం తనకు తెలుసునని ఆమె అన్నారు.
యాదాద్రి: కార్తీకమాసం, ఆదివారం కావడంతో యాదగిరిగుట్టకు భక్తులరద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.
యాదాద్రి: పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా శనివారం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మూసివేయనున్నారు.
తిరుపతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఉదయం తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి పేరుతో యాత్ర ప్రారంభించారు. ముందుగా నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
తిరుపతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 23న తిరుపతికి రానున్నారు. 24న తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనంతరం నారావారిపల్లికి వెళ్లనున్నారు. నారావారిపల్లెలో కులదైవం నాగాలమ్మకు, గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేయనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా: రైతులకు సంకెళ్లు వేసి కోర్టులో హాజరుపర్చడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూముల కోసం పోరాటం చేసిన రైతులకు బేడీలు వస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.