TG : చేనేతల ప్రతిభకు గుర్తింపు
ABN , Publish Date - Aug 07 , 2024 | 03:54 AM
ప్రతిభావంతులైన చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముగ్గురు కళాకారులను వరించింది.
ముగ్గురు చేనేత కళాకారులకు కొండా లక్ష్మణ్‌బాపూజీ పురస్కారాలు
భూదాన్‌పోచంపల్లి/చౌటుప్పల్/చౌటుప్పల్‌రూరల్, ఆగస్టు 6: ప్రతిభావంతులైన చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముగ్గురు కళాకారులను వరించింది. భూదాన్‌పోచంపల్లికి చెందిన ఎన్నం మాధవి, సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన తిరందాస్ సంతోషకుమార్, చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన గడ్డం బాలయ్య పురస్కారానికి ఎంపికయ్యారు. 285 కొయ్యలు, ఐదు సహజ రంగులు వాడి మూడు ఆసు మడతలతో ఎన్నం మాధవి రూపొందించిన 46.5 అడుగుల యార్ట్‌వేజ్ వస్త్రానికి పురస్కారం దక్కింది. అలాగే, 72 డిజైన్లు, 12 రంగులతో తిరందాస్ సంతో్‌షకుమార్ రూపొందించిన తేలియారుమాల్ అనే వస్త్రం అవార్డు తెచ్చిపెట్టింది. ఇక, 30 రకాల సహజ రంగుల వాడి నూతన ర్యాంపో డిజైన్‌లో బాలయ్య రూపొందించిన మల్‌బార్ సిల్కు చీర పురస్కారం సాధించి పెట్టింది.