Share News

Yadadri: యాదగిరి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఆలయ ఈవో..

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:12 PM

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ సోమవారం ఉదయం సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు పాల్గొన్నారు.

Yadadri: యాదగిరి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఆలయ ఈవో..

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ (Giri Pradakshina) సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (MLA Birla Ailaiah), ఆలయ ఈవో భాస్కరరావు (EO Bhaskara Rao) పాల్గొన్నారు. వందలాది భక్తులతో కొండ చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. వైకుంఠ ద్వారం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.


శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ముఖ మండపంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో 108 కలశాలకు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం శతఘటాభిషేకం పూజలు చేశారు. వివిధ ఫలరసాలు, పంచామృతాలు, ఫల జలములు, శుద్ధ జలంతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


కాగా గత నెల చేపట్టిన గిరిప్రదక్షిణలో ఊహించని రీతిలో 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో గిరి ప్రదక్షిణలో భారీగా భక్తులు పాల్గొన్నారు. కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్లు కొనసాగే ఈ గిరి ప్రదక్షిణ సోమవారం ఉదయం 6.05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్యతోపాటు ఈవో భాస్కరరావు పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ సమయంలో వ్రత మండపం, సంస్కృత పాఠశాల, అన్నదాన సత్రం, గిరిప్రదక్షిణ రోడ్డుకు ఇరువైపులా, మల్లాపురం వద్ద గోశాల తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు వేల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేటి నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులు..

బీమా పేరుతో రైతన్నలకు జగన్‌ దగా..

పూరీ జగన్నాథ్ ఆలయంలో టెన్షన్..

దొంగలెక్కలు రాయడంలో ఆయన దిట్ట..

ఏపీ గనుల అక్రమాలపై శ్వేతపత్రం..

మహారాష్ట్ర సీఎంతో చంద్రబాబు కీలక భేటీ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 15 , 2024 | 12:25 PM