Home » BJD
ఒడిశాలో సార్వత్రిక సమరానికి మరి కొన్ని గంటలే మిగిలున్న వేళ బీజేపీ(BJP) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మే 13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఒడిశాలో(Odisha) శనివారం ప్రధాని మోదీ(PM Modi) పర్యటించనున్నారు.
ఒడిసా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? పాతికేళ్ల నవీన్ పట్నాయక్ పాలనను మార్చాలని చూస్తున్నారా? ఇదే అదునుగా బీజేపీ పుంజుకుని, విజయం దక్కించుకునేందుకు తహతహలాడుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు.
ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వం మే 4వ తేదీతో ముగుస్తుందని.. అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని మోదీ పగటి కలలు కంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఒడిశాలో(Odisha) రెండు యాగలు జరుగుతున్నాయని.. ఒకటి దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేయడానికి, మరోటి రాష్ట్రంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ కోసమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ(PM Modi) సోమవారం బెహ్రంపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.
ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని హింజిలీ అసెంబ్లీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. హింజిలీ నుంచి ఆరోసారి ఎన్నిక కావడమే లక్ష్యంగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు రూ.71 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఆయన ప్రకటించారు.