CM Naveen Patnaik: పగటి కలలు కంటున్న ప్రధాని మోదీ..
ABN , Publish Date - May 06 , 2024 | 04:33 PM
ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వం మే 4వ తేదీతో ముగుస్తుందని.. అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని మోదీ పగటి కలలు కంటున్నారని ఆయన పేర్కొన్నారు.
భువనేశ్వర్, మే 06: ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వం మే 4వ తేదీతో ముగుస్తుందని.. అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని మోదీ పగటి కలలు కంటున్నారని ఆయన పేర్కొన్నారు.
AP Elections: ఏపీలో మోదీ పర్యటనపై తెలు‘గోడు’ ఆసక్తి.. వరాలు ఉంటాయా..!?
అందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. సీఎం నవీన్ పట్నాయక్‌తో అత్యంత సన్నిహితుడు వీకే పాండ్యన్.. ఈ వీడియోను విడుదల చేశారు. అందులో సీఎం నవీన్ పట్నాయిక్ మోదీ.. పగటి కలలు కంటున్నారంటూ వ్యాఖ్యానించారు.
LokSabha Elections: రేపు గుజరాత్‌లో ఓటు వేయనున్న ప్రధాని మోదీ
మరోవైపు జూన్ 9వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి 1.30 గంటల మధ్య నవీన్ పట్నాయక్.. ఒడిశా ముఖ్యమంత్రిగా వరుసగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని పాండ్యన్ స్పష్టం చేయడం గమనార్హం.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఒడిశా అసెంబ్లీకి సైతం ఎన్నికలు జరగుతున్నాయి. ఆ క్రమంలో సోమవారం ఒడిశాలోని బెహ్రంపుర్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులోభాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేడీ ప్రభుత్వానికి జూన్ 4వ తేదీతో కాలం తీరుపోతుందన్నారు.
Bomb Threat: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు..
అనంతరం ఒడిశాలో నూతన బీజేపీ ప్రభుత్వం కొలువు తీరనుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు జూన్ 6వ తేదీన ఒడిశా ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తామని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే జూన్ 10వ తేదీన భువనేశ్వర్‌లో ముఖ్యమంత్రిగా నిర్ణయించిన వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఒడిశాలో సారవంతమైన భూమి, ఖనిజ వనరులు, సముద్ర తీర ప్రాంతం, బరంపురం వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతున్నాయన్నారు. అలాంటి ఒడిశా రాష్ట్రం పేదరికంగా మగ్గిపోవడానికి కారణం ఎవరంటూ ప్రజలను ఈ సందర్బంగా మోదీ ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ, బీజేడీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒడిశాను 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే.. మరో 25 ఏళ్ల పాటు బీజేడీ పాలించిందని మోదీ ఈ సందర్బంగా గుర్తు చేశారు.
Read Latest National News And Telugu news