PM Modi: ఒడిశాలో మోదీ పర్యటన నేడు.. కీలక ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
ABN , Publish Date - May 11 , 2024 | 08:23 AM
ఒడిశాలో సార్వత్రిక సమరానికి మరి కొన్ని గంటలే మిగిలున్న వేళ బీజేపీ(BJP) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మే 13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఒడిశాలో(Odisha) శనివారం ప్రధాని మోదీ(PM Modi) పర్యటించనున్నారు.
భువనేశ్వర్: ఒడిశాలో సార్వత్రిక సమరానికి మరి కొన్ని గంటలే మిగిలున్న వేళ బీజేపీ(BJP) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మే 13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఒడిశాలో(Odisha) శనివారం ప్రధాని మోదీ(PM Modi) పర్యటించనున్నారు.
ఉదయం 10.30 గంటలకు కంధమాల్‌లో, 12.15 గంటలకు బోలంగీర్‌లో, మధ్యాహ్నం 1.45 గంటలకు బర్ ఘర్‌లో ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు జార్ఖండ్‌లోని ఛత్రాలో ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలు బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలతో రోడ్లన్నీ కాషాయమయం అయ్యాయి. ప్రధాని సభల్లో ఏం మాట్లాడతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భువనేశ్వర్‌లో రోడ్‌షో
మే 25న పోలింగ్ జరగనున్న భువనేశ్వర్ లోక్‌సభ స్థానం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ప్రచారంలో భాగంగా ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు. ఇటీవలే జరిగిన ప్రచారంలో మోదీ వెంట ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్, భువనేశ్వర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి అపరాజిత సారంగి ఆయన వెంట ఉన్నారు.
Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా.. ఫోన్లోనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
భువనేశ్వర్‌లో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని రోడ్‌షో నిర్వహించారు. ఈ సారి ఎలాగైనా రాష్ట్రంలో గెలుపొందాలనే కసితో పని చేస్తోంది భారతీయ జనతా పార్టీ. 25 ఏళ్లుగా తిరుగు లేని నేతగా ఉన్న సీఎం నవీన్ పట్నాయక్‌ను ఈ సారి ఎలాగైనా ఓడించాలని బీజేపీ పని చేస్తోంది. ఒడిశాలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందనే ప్రచారాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.
For Latest News and National News click here