Share News

Bombay High Court: బిడ్డను కలవనీయకపోవడం క్రూరత్వమే

ABN , Publish Date - Dec 13 , 2024 | 06:01 AM

బిడ్డను కలుసుకోకుండా తల్లిని అడ్డుకోవడం క్రూరత్వం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలు ఆమెను మానసికంగా వేధించడం కిందకే వస్తుందని జస్టిస్‌ విభా కనకన్‌వాడి, జస్టిస్‌ రోహిత్‌ జోషిల ధర్మాసనం స్పష్టం చేసింది.

Bombay High Court: బిడ్డను కలవనీయకపోవడం క్రూరత్వమే

  • తల్లిని మానసికంగా వేధించడమే: బాంబే హైకోర్టు

ముంబై, డిసెంబరు 12: బిడ్డను కలుసుకోకుండా తల్లిని అడ్డుకోవడం క్రూరత్వం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలు ఆమెను మానసికంగా వేధించడం కిందకే వస్తుందని జస్టిస్‌ విభా కనకన్‌వాడి, జస్టిస్‌ రోహిత్‌ జోషిల ధర్మాసనం స్పష్టం చేసింది. అత్తింటివారిపై ఆ తల్లి పెట్టిన కేసును కొట్టివేయడానికి నిరాకరించింది. మహారాష్ట్ర జాల్నాకు చెందిన ఆ మహిళకు 2019లో వివాహం జరిగింది. 2020లో ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే అదనపు కట్నం తేవాలంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించిన అత్తింటివారు 2022 మే నెలలో ఇంటిని బయటకు పంపించివేశారు. పాపను తమ వద్దే ఉంచుకున్నారు.


దాంతో ఆమె భర్త, అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాపను తనకు అప్పగించాలని కోరుతూ ఆమె 2023లో మేజిస్ట్రేటు కోర్టులో పిటిషన్‌ వేసింది. ఆమెకు అనుకూలంగా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆ కోర్టు ఆదేశాలను భర్త అమలు చేయకపోవడంతో ఆమె హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మరోవైపు తమపై కేసును కొట్టివేయాలని కోరుతూ అత్త, మామ, ఆడపడుచు కూడా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. నాలుగేళ్ల పాపను తల్లికి దూరంగా ఉంచడం క్రూరత్వం కిందికే వస్తుందని తెలిపింది.

Updated Date - Dec 13 , 2024 | 06:01 AM