Home » Botsa Satyanarayana
Andhrapradesh: మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్స.. జగన్‌కు తండ్రి సమానులు అంటూ ఓ వార్తను ఈరోజు ఉదయం పేపర్లో చూశానని.. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్‌ను తిట్టిపోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రేపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల మాట్లాడుతూ...
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మాట ఇస్తే... మాట తప్పరు, మడమ తిప్పరని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను పరిపాలన రాజధాని చేస్తానని సీఎం జగన్ అన్నారని.. మళ్ళీ గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెప్పారని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించామని.. పెట్టుబడులు వచ్చాయన్నారు.
Andhrapradesh: సీఎం జగన్ ప్రభుత్వం అవసరం, ఆవశ్యకత ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పెట్టిన వ్యవస్థలు దేశంలో ఎక్కడా లేవన్నారు. జగన్ అమల చేసిన సంస్కరణల వలన రాష్ట్రంలో పేదరికం తగ్గిందని తెలిపారు. విద్యలో కూడా కేరళను అధిగమించామని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ చెప్పిందే చేశారని... చేయలేనివి చెప్పరని అన్నారు.
సొంత ఇలాకా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక నేతలు వైసీపీని వీడారు. మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల కుటుంబం, మాజీ ఎంపీపీ మోతిలాల్ నాయుడు కూడా పార్టీ మారారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పెన్షన్ల పంపిణీకి పది రోజుల సమయం పడుతుందన్న ఏపీ ప్రభుత్వ ప్రకటనపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేకంగా ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని అన్నారు. పెన్షన్లు ఆపేయాలని ఎవరు ఎన్నికల కమిషన్‌కు వెళ్లారని ప్రశ్నిస్తూ.. ఇప్పుడు తిరిగి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Andhrapradesh: డీఎస్సీ 2024 షెడ్యూల్ విషయంలో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. హైకోర్టు ఆదేశానుసారం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం నాడు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి హాల్ టికెట్లు జారీ అవుతాయని.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తన రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మహమ్మద్ షరీఫ్ (Mohammed Shariff) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధి, ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొనే పొత్తులు పెట్టుకున్నారే తప్ప.. సీఎం జగన్‌లా (CM YS Jagan) వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని అన్నారు.
AP Elections 2024: విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (YSR Congress) వింత పరిస్థితి నెలకొంది. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మిని (Botcha Jhansi Lakshmi) నెలరోజుల కిందటే అధిష్ఠానం ప్రకటించింది. కానీ ఇంతవరకూ...
ప్రతి అయిదేళ్లకొకసారి ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడం సాధారణం. ఇది ఆలస్యమైతే మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వడం సంప్రదాయమే.
Andhrapradesh: ‘‘ఛలో సెక్రటేరియట్’’ బయలుదేరిన వైఎస్ షర్మిలను నిన్న (గురువారం) పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. షర్మిల అరెస్ట్ వార్త అందరికీ తెలిసిందే. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం.. షర్మిల అరెస్ట్ విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు.