Botsa: అచ్యుతాపురం ఘటన బాధాకరం
ABN , Publish Date - Aug 22 , 2024 | 01:20 PM
Andhrapradesh: అచ్యుతాపురం ఎస్.ఇ.జెడ్‌లోని ఫార్మాలో జరిగిన ఘటన బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యానారాయణ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల ఆవేదన వర్ణనాతీతమన్నారు. ప్రభుత్వ తీరు బాధ్యతా రాహిత్యంగా ఉందని విమర్శించారు.
విశాఖపట్నం, ఆగస్టు 22: అచ్యుతాపురం ఎస్.ఇ.జెడ్‌లోని ఫార్మాలో జరిగిన ఘటన బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యానారాయణ (YSRCP Leader Botsa Satyanarayana) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల ఆవేదన వర్ణనాతీతమన్నారు. ప్రభుత్వ తీరు బాధ్యతా రాహిత్యంగా ఉందని విమర్శించారు. రేపు (శుక్రవారం) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ (YSRCP Chief YS Jagan) బాధిత కుటుంబాలను కలుస్తారని తెలిపారు. కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
MLC Kavitha: కవితకు మళ్లీ అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
అలాగే మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. 24 గంటలు అయినా జిల్లా ప్రజా ప్రతినిధులు కనిపించటం లేదన్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. పరిహారం చెక్కులు ఇచ్చిన తర్వాతే డెడ్ బాడీస్ తరలించాలన్నారు. గతంలో ఎల్.జి పాలిమర్స్ ఘటనలో అప్పటి వైసీపీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించిందని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అచ్యుతాపురానికి బయలుదేరి వెళ్లారు. కాసేపటిక్రితమే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో నావెల్ కస్టల్ బ్యాటరీ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన మెడికవర్ హాస్పటల్‌కు చంద్రబాబు చేరుకోనున్నారు. అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతోపాటు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ఎస్ఎన్షియ అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీని పరిశీలించనున్నారు.
ఇవి కూడా చదవండి...
Tirupati: స్కూల్‌లో మంటలు... ప్రమాద సమయంలో అక్కడే 350 మంది విద్యార్థులు.. చివరకు!
CM Chandrababu: విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News