Share News

YSRCP: ఇప్పుడొస్తారా?... వైసీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు

ABN , Publish Date - Sep 05 , 2024 | 11:14 AM

Andhrapradesh: వైసీపీ నేతలకు వరద బాధితుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వైసీపీ నాయకులను వరద బాధితులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. విజయవాడ ఆర్‌ఆర్ పేటకు వెళ్లిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను వరద బాధితులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా బొత్సకు తిరిగబడ్డారు వరద బాధితులు. వరదలు వచ్చిన నాలుగు రోజులకు పరామర్శకు వచ్చారా అంటూ నిలదీశారు.

YSRCP: ఇప్పుడొస్తారా?... వైసీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు
YSRCP Leaders

విజయవాడ, సెప్టెంబర్ 5: వైసీపీ నేతలకు (YSRCP Leaders) వరద బాధితుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వైసీపీ నాయకులను వరద బాధితులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. విజయవాడ ఆర్‌ఆర్ పేటకు వెళ్లిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను వరద బాధితులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా బొత్సకు తిరిగబడ్డారు వరద బాధితులు. వరదలు వచ్చిన నాలుగు రోజులకు పరామర్శకు వచ్చారా అంటూ నిలదీశారు. దీంతో బొత్స ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బొత్సతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌‌పై కూడా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ranganth: హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలే గతి


అటు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన నందిగామ మాజీ ఎమ్మెల్యేను వరద బాధితులు నిలదీశారు. స్థానిక మహిళలు తిరగబడ్డారు. వరదలతో మూడు రోజులుగా తాము అవస్థలు పడుతుంటే ఇప్పటి వరకు పట్టించుకోలేదని మండిపడ్డారు. మూడు రోజుల తర్వాత ఇప్పుడొచ్చి రాజకీయం చేస్తున్నారని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు తిరగబడే సరిగి షాక్‌కు గురైన జగన్ మోహన్ రావు తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

botsa.jpg

Vijayawada Floods: విజయవాడలో వరద తగ్గకముందే..


కట్టలు తెంచుకున్న ఆగ్రహం

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చిన వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులకు ఎక్కడికక్కడ వరద బాధితులు షాకిస్తూనే ఉన్నారు. వరద తగ్గిన తరువాత ఇప్పుడా వచ్చేది అంటూ చాలా మంది నిలదీస్తున్నారు. ఎక్కడి వెళ్లిన వైసీపీ నేతలను వరద బాధితులు ఘెరావ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు రాని నేతలు వరదలు పూర్తిగా తగ్గాక పర్యటించడం పట్ల వరద బాధితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా అడుగడుగునా వైసీపీ నేతలను వరద బాధితులు అడ్డుకుంటూనే ఉన్నారు. వరదలను రాజకీయం చేస్తున్నారంటూ బహిరంగంగానే వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు వరద బాధితులు. దీంతో వైసీపీ నాయకులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోతున్న పరిస్థితి. సకాలంలో సహాయక సహకారాలు అందుతున్నాయని, వరదలు తగ్గాక ఇప్పుడెందుకు వచ్చారంటూ కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో వరద బాధితులు మండిపడుతున్న దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావిత ప్రాంతాల్లో కనబుతున్న పరిస్థితి.


ఇవి కూడా చదవండి...

Gold Prices Today: మగువలకు గుడ్ న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు..

Heavy Rains: మైలవరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 12:23 PM