Botsa: 75 రోజులేగా అయ్యింది... వారికి టైం ఇవ్వాలిగా!
ABN , Publish Date - Aug 21 , 2024 | 04:15 PM
Andhrapradesh: విశాఖ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో శాసనమండలిలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు తనను ఎన్నుకున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు చైర్మన్ వద్ద ప్రమాణ స్వీకరాం చేశాం. మా జిల్లా పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చారు. వారందరికి పేరుపేరున ధన్యవాదాలు. ఈ బాధ్యతను నాపై పెట్టిన అధ్యక్షుడు జగన్ కు ధన్యవాదాలు. అసెంబ్లీకి వచ్చారా? మండలికి వచ్చారా? లేదా అనేది కాదు. ప్రజల తరపున మా పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది.
అమరావతి, ఆగస్టు 21: విశాఖ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో శాసనమండలిలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు తనను ఎన్నుకున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (MLC Botsa Satyanarayana) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు చైర్మన్ వద్ద ప్రమాణ స్వీకారం చేశాం. మా జిల్లా పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చారు. వారందరికి పేరుపేరున ధన్యవాదాలు. ఈ బాధ్యతను నాపై పెట్టిన అధ్యక్షుడు జగన్‌కు ధన్యవాదాలు. అసెంబ్లీకి వచ్చారా? మండలికి వచ్చారా? లేదా అనేది కాదు. ప్రజల తరపున మా పార్టీ భాద్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చాలనేది మా అభిప్రాయం. ప్రజల పక్షాన బాధ్యతాయుతంగా.. ప్రజల పక్షాన వారి గొంతై మాటాడుతాము’’ అని అన్నారు.
AP Politics: నాయకుల ఆచూకీ ఎక్కడ.. కార్యకర్తలకు అందుబాటులో లేని నేతలు..
శాసనసభ ప్రారంభమై ఎన్నాళ్లు అయ్యిందని.. ఇప్పటికి ఒక సభే అయ్యింద కదా అని అన్నారు. ఇంతలోనే ఎమ్మెల్యేలు రావడం లేదు అంటే ఎలా అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో వాగ్థానాలు చేసిందని.. వాటిని నెరవేర్చలనేది తమ అభిప్రాయమన్నారు. ఎవరి మీదో బురదజల్లాలనేది తమ అభిమతం కాదన్నారు. ‘‘75 రోజులు అయ్యింది వారు వచ్చి... వారికి టైము ఇవ్వాలిగా’’ అని అన్నారు. విశాఖ రాజధాని అనేది వైసీపీ పార్టీ విధానమని.. ఈ క్షణం వరకూ దాన్ని కొనసాగిస్తామా? లేదా? అనేది పార్టీ చెబుతుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 11మందిలో 7 గురు ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడుతారు అన్న ప్రశ్నకు బొత్స సమాధానం దాటవేశారు. ‘‘ఆ స్పెక్యూలేషన్‌కు తాను సమాధానం చెప్పలేను.. నాకు జోతిష్యం రాదు’’అని పేర్కొన్నారు.
Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకి భారీ ఊరట..
రెండు నెలల్లో కూటమి ప్రభుత్వం గురించి ఓ అభిప్రాయానికి ఎలా రాగలమని అన్నారు. పరిస్ధితులు తెలిసే వాగ్ధానం చేశారు కనుక నెరవేర్చాలి అనుకుంటున్నానన్నారు. స్ధానిక ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం మన ఒక్క రాష్ట్రంలోనే ఉందా అని అన్నారు. ఢిల్లీకి రాష్ట్రంలోని శాంతిభద్రతలు దౌర్జన్యాలు దమనకాండలపై వెళ్లామని చెప్పుకొచ్చారు. ‘‘కేసులు అధికారులపైనా, నాపైన పెడతారా అనేది నేను మాట్లాడను. తప్పు చేసిన వారికి శిక్షపడాల్సిందే. విద్యాశాఖలో చిక్కిలు, ట్యాబ్‌లు, సింగిల్ ఆర్డర్ జీవోల విషయంలో ఎంక్వైరీ వద్దంటే మానేస్తారా? చేయమంటే చేస్తారా? ఏదైనా చేసుకుంటే చేసుకోండి. తప్పుంటే శిక్షించండి’’ అని అన్నారు. ‘‘నాపై ఎంక్వైరీ వేస్తామంటే ఏమంటారు అని అడిగిన ప్రశ్నకు నేను వద్దంటాను... మానేస్తారా’’ అంటూ ఎదురు ప్రశ్న వేశారు బొత్స. పరిస్ధితిలు ఎప్పుడు ఒకేలా ఉండవు అంటూ బొత్స వేదాంతం చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి...
Rajendraprasad: పంచాయతీల అభివృద్ధికి రూ.900 కోట్లు జమ చేయడంపై వైవీబీ హర్షం
Jagan: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ మరోసారి పిటిషన్
Read Latest AP News And Telugu News