Home » Car Accident
కారు డ్రైవర్ నిద్రమత్తు ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దర్ని తీవ్ర గాయాలపాల్జేసింది. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం..
రేడియం స్టిక్కర్లు గానీ, పార్కింగ్ లైట్లు గానీ లేకుండా రోడ్డుపై ఆగివున్న ఆ వ్యాను తీర్థయాత్ర ముగించుకొని కారులో తిరుగు ప్రయాణమైన వారి పాలిట మృత్యువై నిరీక్షించింది!
దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడి.. ముగ్గురిని కబలించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పెద్దగోల్కొండ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆ వ్యక్తిది ఎంత దారుణమైన చావు! కారు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి బానెట్‌పై పడి.. అద్దానికి (విండ్‌షీల్డ్) బలంగా తగిలాడు! ఆ వేగానికి కారు అద్దం పగిలిపోవడం.. కారులోకి చొచ్చుకెళ్లిన తల ఆ అద్దం పదునుకు శరీరం నుంచి వేరై కారులోపల పడటం.. క్షణాల్లో జరిగిపోయాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ నంది కుమారుడు, కోడలు మంగళవారంనాడు జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని హుటాహుటిన లక్నోలోని ఆసుపత్రికి తరలించారు.
రాజీవ్ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్‌ను దాటి పక్క లైన్లోకి దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి.
కారులో వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడమే కాకుండా, బైకర్ ఏమయ్యాడో కూడా చూడకుండా మృతదేహాన్ని 3 కిలోమీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు ఓ కారు డ్రైవర్. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్‌ప్లాజా వద్ద జరిగింది.
వైద్యం కోసం ఖమ్మం వచ్చి.. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా అనూహ్యంగా దూసుకొచ్చిన కారు వారిపాలిట మృత్యుశకటమైంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జగన్నాథపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.
స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన ప్రమాణిస్తున్న కారు ఢీకొని ఓ మహిళ మరణించింది. కాజీపేట మండలం మడికొండలో శనివారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.