Hyderabad: ఘోర ప్రమాదం.. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. చివరికి ఏమైందంటే..
ABN , Publish Date - Jan 25 , 2025 | 08:16 AM
హైదరాబాద్: బంజారాహిల్స్ (Banjara Hills)లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ(శనివారం) తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి (Basavatarakam Cancer Hospital) వద్ద కారు ప్రమాదం(Car Accident)లో ఒకరు మృతిచెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.

హైదరాబాద్: బంజారాహిల్స్(Banjara Hills)లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ(శనివారం) తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి (Basavatarakam Cancer Hospital) వద్ద కారు ప్రమాదం(Car Accident)లో ఒకరు మృతిచెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రి వద్ద ఫుట్ పాత్‌పై ముగ్గురు నిద్రిస్తుండగా వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం అనంతరం బాధితులను చూసిన కారులోని వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాధితులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కారు ఎవరిది, ప్రమాదం ఎలా జరిగింది, పరారైన నిందితులు ఎవరనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Eluru: అందరూ నిద్రలో ఉండగా అగ్నిప్రమాదం.. బాబోయ్.. ఇలా జరిగిందేంటి..
Gold and Silver Rates: మహిళలకు బిగ్ షాక్.. జీవితకాల గరిష్ఠానికి బంగారం ధర..