Home » Car Accident
పుణేలో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు పోర్సే కారు వేగంగా వచ్చింది. తన ముందు ఉన్న బైక్‌ను వేగంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరి పడ్డారు. స్పాట్లోనే చనిపోయారు. ఆ సమయంలో అక్కడున్న స్థానికులు కారు నడిపిన వ్యక్తిని బయటకు తీశారు. దేహశుద్ది చేసి, పోలీసులకు అప్పగించారు. చిన్న వయస్సు ఉంది. ఆ యువకుడికి 17 ఏళ్లు అని తేలింది. క్లబ్లో పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది.
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. చికాగోలో విద్యార్థి మార్కొ నికెటిక్ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి కారులో వెళ్తున్నాడు. అతని కారును కిమ్ అనే వ్యక్తి వెనక నుంచి వేగంగా ఢీ కొన్నాడు. ప్రమాద సమయంలో కిమ్ కారు స్పీడ్ 193 కిలోమీటర్ల వేగంతో ఉంది.
నేటి ఆధునిక కాలంలో మనిషిలో మానవత్వం చచ్చిపోతుందనే మాట ఎక్కువుగా వింటూఉంటాం. కానీ ఒక్కో వ్యక్తి ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. వ్యక్తి ప్రవర్తన ఆధారంగా ఆ వ్యక్తిలో మానవత్వాన్ని అంచనా వేస్తుంటారు. ఏదైనా బాధాకరమైన ఘటన జరిగినప్పుడు స్పందించే తీరు వ్యక్తి మానవత్వానికి కొలబద్దగా చెప్పుకోవచ్చు.
ఓ కారు ఫుట్ పాత్పైకి దూసుకొచ్చింది. కారు ఢీ కొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియదు. 11 సెకన్ల నిడివి గల వీడియో చూస్తే రోమాలు నిక్కపొడవడం ఖాయం. అటు వైపు నుంచి వస్తోన్న ఓ కారు సడెన్‌గా ఫుట్ పాత్పైకి దూసుకొచ్చింది. ఆ కారు స్పీడ్‌గా ఉండటంతో ఫుట్ పాత్ మీద ఉన్న నలుగురు ఎగిరిపడ్డారు.
అమెరికాలోని సౌత్ కరోలినాలో శనివారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్విల్లే కౌంటీలో ఓ బ్రిడ్జిపై నుంచి వేగంగా వెళ్తున్న ఎస్యూవీ పల్టీలు కొడుకు గాలిలోకి ఎగిరి ఒక చెట్టుపై ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం పాలయ్యారు.