YCP MP Daughter: వైసీపీ ఎంపీ కూతురు అరెస్ట్
ABN , Publish Date - Jun 19 , 2024 | 08:16 AM
వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు చెన్నైలో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. రోడ్డు పక్కన పడుకొన్న వ్యక్తి పైనుంచి కారు పోనిచ్చారు. సూర్య అనే వ్యక్తి మద్యం సేవించి బసంత్ నగర్ రోడ్డు పక్కన పడుకున్నాడు. అతనిని గమనించకుండా మస్తాన్ రావు కూతురు మాధురి సోమవారం సాయంత్రం కారు పోనిచ్చారు. దీంతో సూర్య తీవ్రంగా గాయపడ్డారు.
చెన్నై: వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు (YCP MP Beeda Masthan Rao) కూతురు చెన్నైలో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. రోడ్డు పక్కన పడుకొన్న వ్యక్తి పైనుంచి కారు పోనిచ్చారు. సూర్య అనే వ్యక్తి మద్యం సేవించి బసంత్ నగర్ రోడ్డు పక్కన పడుకున్నాడు. అతనిని గమనించకుండా మస్తాన్ రావు కూతురు మాధురి సోమవారం సాయంత్రం కారు పోనిచ్చారు. దీంతో సూర్య తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు సూర్య భార్య వినిత కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మాధురిని అరెస్ట్ చేశారు. ఆ వెంటనే స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపిన మాధురి, ఆమె స్నేహితురాలు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. స్థానికులు వచ్చి ప్రశ్నించడంతో మాధురి ఫ్రెండ్ వాదనకు దిగింది. అంబులెన్స్ రాక ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంబులెన్స్‌కు కాల్ చేసిన నంబర్ ఆధారంగా పోలీసులు మాధురిని కనుకొన్నారు. ఆ కారు పుదుచ్చేరి రిజిష్ట్రేషన్ పేరుతో ఉందని వివరించారు. ఆ తర్వాత మాధురిని అరెస్ట్ చేశారు.