Home » CBI
దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన దస్తగిరి(Dastagiri).. ఎంపీ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్‌గా మారిన తనపై తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ..
సందేశ్‌ఖాలీ కేసులో భూఆక్రమణలు, లైంగిక దాడులు, ఈడీ అధికారులపై దాడుల ఆరోపణలను ఎదుర్కొంటున్న టీఎంసీ సస్పెండెడ్ నేత షేక్ షాజహాన్‌ను ఎట్టకేలకు బెంగాల్ పోలీసులు సీబీఐకి బుధవారం సాయంత్రం అప్పగించారు. దీంతో బెంగాల్ ప్రభుత్వానికి, సీబీఐకి మధ్య రెండ్రోజులుగా తలెత్తిన ప్రతిష్టంభనకు తెరపడింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి కేసులో నిందితుడు షేక్ షాజహాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం 4.30 గంటల కల్లా అప్పగించాలని పశ్చిమబెంగాల్ సీఐడీని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్ సీఐడీకి కోర్టు ధిక్కార నోటీసులు కూడా జారీ చేసింది.
బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సందేశ్ ఖాళి ఘటనతో నెలకొన్న ఆందోళనతో బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అంతకుముందు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కూడా ఇలాంటి ప్రతిపాదన చేశారు.
Andhrapradesh: మాజీ మంత్రి వివేక హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రపైన విచారణ జరిపించాలని టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం తన తండ్రిని హత్య చేయించారని వైఎస్ సునీతారెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. రాష్ట్రంలో హంతకులకు ప్రజలకు మధ్య పోరాటం ఇదన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ సుదీప్ బెనర్జీని అరెస్ట్ చేయాలని ఆ పార్టీ నేత కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు. కోల్ స్కామ్ కేసులో సుదీప్ బెనర్జీ హస్తం ఉందని కునాల్ ఘోష్ ఆరోపించారు. కోల్ స్కామ్‌లో జరిగిన అవకతవకలపై సీబీఐ, ఈడీ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఇవాళ మీడియా ముందుకు రానున్నారు. 11 గంటలకి ఢిల్లీ కాన్స్ట్యూషన్ క్లబ్ లో సునీతారెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వివేకానంద రెడ్డి హత్యకు కుట్ర దారులు ఎవరో మీడియాకు సునీతారెనడ్డి వెల్లడించనున్నారు. మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బాబాయి హత్య ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉన్న సమయంలో (2012-2016) జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు జారీచేసింది. ఢిల్లీలో శుక్రవారం నాడు (రేపు) విచారణకు హాజరు కావాలని కోరింది. సీబీఐ సమన్లు జారీచేసిన అంశంపై సమాజ్ వాదీ పార్టీ స్పందించింది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు పంపింది. 160 సీఆర్పీసీ కింద దర్యాప్తు సంస్థ ఈ సమన్లు పంపింది. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 2012-2016 మధ్య ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం వెలుగుచూసింది.
వివేక హత్య కేసులో (Viveka Murder Case) అప్రూవర్‌గా మారిన దస్తగిరిని మరోసారి ప్రలోభానికి గురిచేశారు. సీబీఐ(CBI) ఎస్పీ రామ్ సింగ్ కొట్టి అప్రూవర్‌గా మార్చాడని చెప్పాలంటూ తీవ్ర ఒత్తిడి చేశారు. అలా చెబితే ఏకంగా రూ.20 కోట్లు అడ్వాన్స్‌గా ఇస్తామంటూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఆఫర్ చేశారు. దస్తగిరి జైలులో ఉన్న సమయంలో చైతన్య రెడ్డి డాక్టర్‌గా వెళ్లి జైల్లో ప్రలాభాలకు గురిచేశాడని సీబీఐ కోర్టుకు దస్తగిరి వెల్లడించాడు.