Home » CBI
ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ( CM JAGAN ) అక్రమాస్తుల కేసుల విచారణ నేడు (శుక్రవారం) జరిగింది. నిందితులపై ఉన్న 127 డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు కొలిక్కి వచ్చాయి. 11 సీబీఐ, 8 ఈడీ ఛార్జిషీట్లలో నిందితుల డిశ్చార్జి పిటీషన్లపై విచారణ కొలిక్కి వచ్చింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ( Vivekananda Reddy ) హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ( Bhaskar Reddy ) కి కండిషన్ బెయిల్ ముగిసింది. కండిషన్ బెయిల్ ముగియడంతో సీబీఐ కోర్టు ( CBI Court ) లో భాస్కర్‌రెడ్డి లొంగిపోయారు.
డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారానే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహువా మెయిత్ర చట్టూ ఉచ్చు బిగుస్తోంది. లోక్‌పాల్ ఆదేశాలపై ఆమెపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది.
వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దస్తగిరి పిటిషన్‌ను నవంబర్ 20కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. కౌన్సిల్ లేకపోవడంతో వాదనలకు దస్తగిరి అడ్వకేట్ సమయం కోరారు. నిందితులకు ఇచ్చిన హార్డ్ కాపీలను సైతం దస్తగిరి తీసుకోలేదు.
Andhrapradesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణను సీబీఐకు ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఉండవల్లి పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులకు గతంలో నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరిస్తే రెండు గంటల్లోనే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరుపుతుందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనిపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది.
రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణాలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు కోర్టులో మరో షాక్ తగిలింది. గురువారం ఆయన్ని కోర్టులో హాజరుపరచగా సిసోదియా రిమాండ్ ను నవంబర్ 22వరకు పొడగించాలని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఆదాయానికి మించిన అక్రమార్కుల కేసులో సీబీఐ(CBI) ఎఫ్ఐఆర్ ను సవాలు చేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar)కి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది.