Home » CBN
దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన లీడర్. ఓ విజన్ ఉన్న నాయకుడు. అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లే చంద్రబాబు సీఎం కావాలని ఏపీ ప్రజలు సంకల్పించుకున్నారు.
ఏపీ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. మరో వారం రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎక్కువమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, పూర్వపు ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి (74) ఇక లేరు.
: ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఓ వ్యకి హైదరాబాద్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నాలుక కోసుకున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా పోలవరం మండలం, గూటల గ్రామానికి చెందిన చేడల మహేశ్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితిని కల్పించాలని, పోలింగ్ శాతం పెరిగేలా కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఓటమి భయంతో వైసీపీ ఊహించని స్థాయిలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, పోలింగ్ చివరి నిమిషం వరకు పూర్తి స్థాయి అప్రమత్తతతో ఉండాలని నిర్దేశించారు.
ప్రధాని మోదీ(PM Modi) మే 14న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(Varanasi) లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు.
2019లో పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలను జగన్ అడిగారు. సరేలే అని అవకాశం ఇచ్చి ఉంటారు. ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో ఆ జనమే చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా వేదిక కూల్చి తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తర్వాత విపక్ష నేతలను టార్గెట్ చేశాడు. తొలినాళ్లలో కరెంట్ సమస్య ఎక్కువగా ఉండేది. రహదారుల సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రహదారుల మరమ్మతులు జరగలేదు. అందుకే ఈ సారి కూటమి వైపు జనాలు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఏపీలో ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజులు సమయం మాత్రమే ఉంది. గెలుపు మాదేనంటూ ఎన్డీయే కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. వికసిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. మరోవైపు అధికార వైసీపీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతం టార్గెట్ చేస్తోంది. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలో ఎన్డీయే కూటమి విజయవకాశాలు ఎలా ఉన్నాయి. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వలన తెలుగుదేశం, జనసేన జోడికి లాభమా.. నష్టమా..
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్మోహన్రెడ్డి విజయవంతంగా గోదావరిలో ముంచేశారు. చంద్రబాబు హయాంలో ఉవ్వెత్తున సాగిన పనులను రివర్స్ టెండరింగ్‌తో బొంద పెట్టేశారు.
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్‌పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.